కృష్ణా జిల్లా మైలవరంకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. మైలవరం ప్రాంత అభివృద్ధికి జగన్ ప్రభుత్వం మరింత చొరవ తీసుకోవల్సిందిగా హనిమిరెడ్డి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు ₹50కోట్లకు పైగా విరాళాలను పలు సామాజిక సేవా కార్యక్రమాలకు అందించిన హనిమిరెడ్డిని జగన్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన వంటివారు సహకరించవల్సిందిగా జగన్ కోరారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తితిదే ఛైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌ను కలిసిన డా.లకిరెడ్డి హనిమిరెడ్డి
Related tags :