Politics

కర్ణాటకలో కప్పగంతులు వేస్తున్న రాజకీయం–TNI కధనాలు

The strange story of hide and seek politics in Karnataka

1.కర్ణాటక సంక్షోభం: బలపరీక్ష డౌటే, బాంబు పేల్చిన సిద్ధరామయ్య.
కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్షలో బాంబు పేల్చారు కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత సిద్ధరామయ్య. ఇవాళ బలపరీక్ష లేనట్లేనని సందేహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ బలపరీక్ష జరిగే అవకాశం లేదని తేల్చి చెప్పారు.సభలో చర్చ జరుగుతోందని అది ఇంకా ముగియలేదన్నారు. సభలో ఇంకా 20 మంది సభ్యులు మాట్లాడాల్సి ఉందన్నారు. సభ్యులంతా మాట్లాడిన తర్వాతే బలపరీక్ష ఉంటుందంటూ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతానికి అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతుందనే గ్యారంటీ లేదన్నారు. అంతేకాదు ఈ చర్చ సోమవారం కూడా కొనసాగవచ్చునని తేల్చి చెప్పారు. ఇకపోతే సభలో కుమార స్వామి బలపరీక్ష శుక్రవారం లేనట్లేనని పరోక్షంగా హింట్ ఇచ్చారు సిద్ధరామయ్య. మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోపు సభలో మెజారిటీ నిరూపించుకోవాలంటూ కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా సీఎం కుమారస్వామికి ఆదేశించారు. అందుకు కుమారస్వామి అంగీకారం కూడా తెలిపారు. గవర్నర్ గడువు దాటినప్పటికీ అసెంబ్లీలో ఎలాంటి చర్చ ప్రారంభం కాలేదు. చర్చ ముగిసేంత వరకు ఓటింగ్ జరిగే ప్రసక్తే లేదని స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. తనను శాసించే హక్కు గవర్నర్ కు లేదంటూ హెచ్చరించారు. గవర్నర్ వాజుభాయ్ వాలా ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ, కుమార స్వామి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లో ఈ అర్థరాత్రి 12 గంటలకు అయినా సరే బలపరీక్ష జరిపి తీరాల్సిందేనంటూ బీజేపీ నినాదాలు చేసింది. దీంతో సభ వాయిదా వేశారు స్పీకర్ రమేష్ కుమార్.
2. మూడో దఫా గవర్నర్ డెడ్‌లైన్, కోర్టుకు కుమారస్వామి…
శుక్రవారం సాయంత్రం ఆరు గంటల లోపుగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని కర్ణాటక గవర్నర్ వాజ్‌భాయ్ వాలా సీఎం కుమారస్వామికి లేఖ రాశాడు. అయితే గవర్నర్ ఈ రకంగా లేఖ రాయడంపై సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.మరో వైపు విప్‌పై కూడ స్పష్టత ఇవ్వాలని కూడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.తొలుత గురువారం సాయంత్రం వరకే అసెంబ్లీలోనే బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. అయితే అసెంబ్లీని స్పీకర్ శుక్రవారం నాటికి వాయిదా వేశారు. తనను సుప్రీంకోర్టు కానీ, గవర్నర్ కానీ ఆదేశించలేరని స్పీకర్ స్పష్టం చేశారు.దీంతో గురువారం రాత్రి అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు నిద్రపోయారు. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఒకటిన్నర వరకు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ రెండోసారి ఆదేశాలు జారీ చేశారు. కానీ, శుక్రవారం నాడు అసెంబ్లీలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో మరోసారి బీజేపీ బృందం గవర్నర్ ను కలిసింది. బీజేపీ ప్రతినిధుల విన్నపం మేరకు ఇవాళ సాయంత్రం వరకు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.ఈ ఆదేశాలపై సీఎం కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలకు విప్ విషయమై స్పష్టత ఇవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గుండురావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
3. సీఎం కుమారస్వామికి మళ్లీ గవర్నర్ లేఖ
కర్ణాటకలో రాజకీయ సంక్షోభం క్షణానికో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం తమ అధిక్యాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ వాజూభాయ్ వాలా విధించిన గడువును స్పీకర్ పట్టించుకోకపోవడంపై బీజేపీ నిరసన వ్యక్తం చేస్తోంది. మధ్యాహ్నం 1.30 గంటల్లోపు బలపరీక్ష పూర్తి చేయాలని తొలుత గవర్నర్ సూచించిన విషయం తెలిసిందే. ఐతే పూర్తి చర్చ జరిగిన తర్వాతే ఓటింగ్ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. దీంతో విశ్వాసపరీక్ష మరింత ఆలస్యం కానున్న నేపథ్యంలో సీఎం హెచ్‌డీ కుమారస్వామికి గవర్నర్ మళ్లీ లేఖ రాశారు. సభలో బలం నిరూపించుకోవాలని కుమారస్వామికి గవర్నర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు బలం నిరూపించుకోవాలని కోరారు.
కర్ణాటక రాజకీయ వ్యవహారం మళ్లీ సుప్రీం కోర్టుకు చేరింది. విప్‌పై క్లారిటీ ఇవ్వాలని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండురావు పిటిషన్ వేశారు. 17వ తేదీనాటి సుప్రీం కోర్టు ఉత్తర్వుల్లో విప్‌పై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న కోర్టు ఆదేశాలపై గుండురావు స్పష్టత కోరారు.
4. కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ బలపరీక్ష లేనట్లే..!
కర్ణాటక అసెంబ్లీలో ఇవాళ బలపరీక్ష లేనట్లే. సభలో చర్చ పూర్తైన తర్వాతే విశ్వాస పరీక్ష చేపట్టవచ్చు. బలపరీక్షపై స్పీకర్ రమేష్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. తీర్మానంపై చర్చ పూర్తికాకుండా బలపరీక్ష ఎలా నిర్వహిస్తామని ప్రతిపక్ష సభ్యులకు స్పీకర్ సూచించారు. చర్చ ముగిసిన తర్వాత మాత్రమే బలపరీక్ష ఉంటుందని స్పీకర్ స్పష్టం చేశారు. ఐతే గవర్నర్ ఆదేశాలను స్పీకర్ పాటించలేదంటూ బీజేజీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ తీరుపై గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. బలపరీక్షపై చర్చ పూర్తికాలేదు. చర్చలో ఇంకా 20 మంది మాట్లాడాల్సి ఉంది. చర్చ ఇవాళ పూర్తికాదని అనుకుంటున్నా. విశ్వాస పరీక్షపై చర్చ సోమవారం కూడా కొనసాగే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య పేర్కొన్నారు. చర్చలో ఇంకా 20 మంది మాట్లాడాల్సి ఉందన్నారు. గవర్నర్ ఆదేశాలను పాటించకపోవడంపై బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. కర్ణాటక విధాన సభలో శుక్రవారం కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. భోజన విరామం అనంతరం చర్చ ప్రారంభమైంది.
5. కుమార’కు గవర్నర్ మరో డెడ్‌లైన్‌!
కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బలపరీక్షపై గవర్నర్‌ వాజూభాయి పటేల్‌ ఇచ్చిన డెడ్‌లైన్‌ ముగిసినప్పటికీ విధానసభలో కుమార స్వామి తన బలాన్ని నిరూపించుకోకపోవడంతో గవర్నర్‌ ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. ఈ సాయంత్రం 6గంటల్లోపు సభలో బల పరీక్ష పూర్తిచేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన రాజ్‌భవన్‌ నుంచి విధాన సౌధకు సమాచారం అందించారు. రాష్ట్రంలో నెలకొన్న నాటకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నారు.శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ సభను మధ్యాహ్నం 3గంటలకు వాయిదా వేశారు. అయితే, 1.30 గంటలకే బల పరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ సూచించినప్పటికీ.. కుమార స్వామి తన బలాన్ని నిరూపించుకోలేదు. డెడ్‌ లైన్‌ విధించిన ప్రకారం ఈ మధ్యాహ్నం 1.30 గంటలకు కూడా బలపరీక్షపై ఎటూ తేల్చకపోవడంతో గవర్నర్‌ కేంద్రానికి నివేదిక పంపారు. ఇదిలా ఉండగా.. సిద్ధరామయ్య మాత్రం ప్రస్తుతం చర్చ ఇంకా కొనసాగుతున్నందున ఈ రోజు బలపరీక్ష ఉండదని, సోమవారం సభ కొనసాగుతుందని చెప్పడం గమనార్హం.
6. మళ్లీ సుప్రీంకోర్టుకు కర్ణాటక రాజకీయం!
మరోవైపు, కర్ణాటకలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ నెల 17న సుప్రీంకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టత కోరుతూ కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు దినేష్‌ గుండూరావు శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో 15 మంది అసంతృప్త ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై బలవంతం చేయలేమన్న ఆదేశాలపై ఆయన స్పష్టత కోరారు. విప్‌ జారీ అనేది పార్టీకి ఉన్న హక్కు అని.. 10వ షెడ్యూల్‌ ఉల్లంఘన ఎమ్మెల్యేలకు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. సమావేశాలకు హాజరు కావాలంటూ అసంతృప్త ఎమ్మెల్యేలకు కాంగ్రెస్‌ ఇప్పటికే విప్‌ జారీచేసింది. పార్టీకి ఆదేశాలకు లోబడి తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది.. లేదంటే అనర్హత వేటు వేయాల్సి ఉంటుందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
7. సీఎం సీటు కావాలంటే తీసుకోండి..
కర్ణాటకలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సంకీర్ణ ప్రభుత్వం ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు నిన్న ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ జరుగుతోంది. శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత విశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభించాలని స్పీకర్‌ సీఎంను కోరారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. మరోసారి భాజపాపై ధ్వజమెత్తారు.
8. సుప్రీం కోర్టును ఆశ్రయించిన కర్ణాటక సీఎం కుమారస్వామి
కర్ణాటక రాజకీయం సుప్రీంకోర్టు చుట్టూ తిరుగుతోంది. తాజాగా గవర్నర్ వాజూభాయ్ వాలా ఆదేశాలపై కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బలపరీక్షపై గవర్నర్ పంపిన లేఖలను సవాల్ చేశారు. అలాగే విప్‌పై స్పష్టతనివ్వాలని కోరారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌లో గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని కుమారస్వామి పేర్కొన్నారు. సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా గవర్నర్ జోక్యం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. విప్ అనేది రాజ్యాంగ హక్కు అని కుమారస్వామి పిటిషన్‌లో పేర్కొన్నారు.
9. దేవుడా.. న‌న్నెందుకు సీఎంను చేశావు !
క‌ర్నాట‌క అసెంబ్లీలో ఇవాళ సీఎం కుమార‌స్వామి మాట్లాడారు. బ‌ల‌ప‌రీక్ష తీర్మానం సంద‌ర్భంగా ఇవాళ రెండ‌వ రోజు కూడా సీఎం మాట్లాడారు. మీరే సీఎం కావాలంటూ త‌న‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని, తాను ఎవ‌రి ద‌గ్గ‌రికీ వెళ్ల‌లేద‌న్నారు. సీఎం పీఠం త‌న‌కు ముఖ్య‌మైంది కాద‌ని, కానీ భ‌విష్య‌త్తు త‌రాల‌కు కీల‌కం అన్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగేందుకుకే మ‌న స్వాతంత్ర్య స‌ర‌మ‌యోధులు ప్ర‌జాస్వామ్యాన్ని రూపొందించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో త‌న‌ను ఎందుకు సీఎంను చేశావ‌ని దేవుణ్ని అడుగుతున్నాని, ఇది నిజంగా త‌ల‌రాతే అన్నారు. బ‌ల‌ప‌రీక్ష‌పై చ‌ర్చ చేప‌డుదామ‌ని, మీరే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయండి, ఇందులో తొంద‌రెందుకు అని బీజేపీని ఉద్దేశిస్తూ సీఎం కామెంట్ చేశారు. సీఎం అధికారాల‌ను దుర్వినియోగం చేయ‌న‌న్నారు. త‌మ కూట‌మి ఎమ్మెల్యేల‌కు ఒక్కొక్క‌రికి 50 కోట్లు లంచం ఇచ్చార‌ని, అది ఎవ‌రి సొమ్ము అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇవాళ కూడా 20 మంది రెబ‌ల్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజ‌రు అయ్యారు. త‌న‌ను ఎవ‌రూ కిడ్నాప్ చేయ‌లేద‌ని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ తెలిపారు. హెల్త్ చెక‌ప్ కోసం ముందు చెన్నై వెళ్లి.. అక్క‌డ నుంచి ముంబైకి వ‌చ్చిన‌ట్లు ఎమ్మెల్యే పాటిల్‌.. స్పీక‌ర్‌కు లేఖ ద్వారా తెలిపారు.