అమెరికాకు చెందిన ప్రవాసాంధ్ర తెదేపా సభ్యులు, కార్యకర్తలు గురువారం నాడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 16మంది సభ్యుల బృందం బాబుతో భేటీ అయి తెదేపాను తిరిగి అధికారంలోకి తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపింది. ఈ సమావేశంలో ఠాగూర్ మల్లినేని, రామారావు పంగులూరి, ప్రదీపుకుమార్ సోమవరపు, సాయి బొల్లినేని, వెంకటకృష్ణ ప్రసాదు కాట్రగడ్డ, నందకిషోర్ యార్లగడ్డ, చందు నరిసెట్టి, సురేంద్ర బాబు అప్పలనేని, రేఖ మర్తి, నాగరాజు నలబోలు, అంజలి పంగులూరి, కిషోర్ మారీడు, వెంకట్ ముత్యాల, వెంకటేశ్వర్లు కర్నాటి, వేములబాబు బొల్లు తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబును కలిసిన ప్రవాసాంధ్రులు
Related tags :