చిన్నచిన్న సందర్భాలకు ఆకట్టుకునే వర్ణాలు, బ్లాక్ ప్రింట్ల సోయగాలతో ఆహ్లాదాన్ని పంచే చీరలు నప్పుతాయి. అలాంటివే ఇవన్నీ. కట్టుకుంటే నిండుగా కనిపిస్తారు. ప్రత్యేకంగానూ నిలుస్తారు. ముదురు నీలం రంగు చేనేత చీరపై గుండ్రటి బుటీలు, నప్పే జరీ అంచు… అక్కడక్కడా వైవిధ్యంగా ఉన్న చిన్న చిన్న పూల ప్రింట్లు… కట్టుకుంటే కళగా కనిపించొచ్చు. లేత పసుపు రంగు చీరకు నిలువుగీతల టెంపుల్ బార్డర్, దానిపై గులాబీ, ఆకుపచ్చ వర్ణాల మేళవింపుతో బ్లాక్‌ప్రింట్ పూల సోయగం… ఎంతందమో! జాల్ పూలతల సోయగం, అద్దాల పనితనం… చూడ చక్కని రంగుల్లో వైవిధ్యంగా ఉందీ చీర. నీలం రంగు చీరకు గులాబీ, బంగారు వర్ణాల కలయికతో అంచు… దానిపై బొమ్మలు, మట్కా మోటిఫ్‌లు ముచ్చటగా కనిపిస్తున్నాయి. చీరంతా పరచుకున్న జాల్ బ్లాక్ ప్రింటు, దానికి కాంట్రాస్ట్ అంచు… కొంగు వరకూ కొత్తగా కనిపించేలా చేసే మండల డిజైను… వావ్ అనిపిస్తోంది కదూ!
మహిళలూ…చేనేతను ప్రోత్సహించండి

Related tags :