Politics

ఏపీ క్యాబినెట్ భేటీలో మంచి నిర్ణయాలు

Andhra Cabinet Meeting Takes Useful Decisions For Public

టెండర్ల ప్రక్రియలో పారదర్శకత పెంచేలా జ్యూడిషియల్ కమిషన్ ముసాయిదా బిల్లుతో పాటు YSR నవోదయం పథకానికి ఏపీ మంత్రివర్గం ఆమోదించింది. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించి కొత్త చట్టం తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది ప్రభుత్వం. పక్షపాతం లేకుండా టెండర్ల నిర్వహణ, బిడ్డింగ్ లో గందరగోళాన్ని నివారించి పారదర్శకత పెంచటంతో పాటు కాంట్రాక్ట్ ల పేరుతో ప్రజాధనం లూటీ కాకుండా కాపాడటమే లక్ష్యంగా బిల్లును రూపొందించి ఏపీ ప్రభుత్వం.జ్యూడిషియల్ కమిషన్ ముసాయిదా బిల్లు ప్రకారం..ఇక నుంచి హైకోర్టు జడ్జి లేదంటే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోనే టెండర్ల పరిశీలన జరగనుంది. మౌలిక సదుపాయల ప్రాజెక్టుల్లో వంద కోట్లకు పైబడే ప్రతీ టెండరు హైకోర్టు జడ్జి లేదంటే రిటైర్డ్ జడ్జికి పరిధిలోకి వెళ్తాయి. టెండర్ల పరిశీలన కోసం జడ్జికి సాహాయంగా అవసరమైన నిపుణులను ప్రభుత్వం అందిస్తుంది. టెండర్ల ప్రక్రియ ప్రారంభమైన వారం రోజుల్లో సదరు ప్రాజెక్ట్ ప్రతిపాదనలను నిపుణులతో పాటు ప్రజలు కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. మరో 8 రోజుల్లో జడ్జి పరిశీలిస్తారు. మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదన ఖరారు అవుతుంది. ఆ తర్వాతే బిడ్డింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.ఏపీ మంత్రివర్గం వైఎస్సార్ నవోదయం పేరుతో కొత్త పథాకానికి ఆమోదం తెలిపింది. మూడేళ్లుగా ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేలా పథకం రూపొందించారు. అలాగే 2018 నాటి ఏపీఈబీడీ చట్టాన్ని తొలగించిన ఏపీ ప్రభుత్వం దాని స్థానంలో ఏపీ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ యాక్ట్ ముసాయిదా బిల్లును ఆమోదించింది. సీఎం బోర్డు చైర్మన్ గా ఏడుగురు డైరెక్టర్లు ఉండే APIPMA తో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయనున్నారు. అలాగే ఎస్సీలకు 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు ఉచితం ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలోని 15 లక్షల 62 వేల మందికి ఎస్సీలకు ప్రయోజనం చేకూరనుంది. రాష్ట్రంలోని విద్యాసంస్థల పర్యవేక్షణ, నియంత్రణ ముసాయిదా బిల్లుకు కూడా జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది.