Sports

ధోనికి కోరిక చావలేదు

Dhoni Will Not Retire Says His Business Partner Arun Pandey

టీమిండియా మాజీ కెప్టెన్‌‌ మహేంద్రసింగ్‌‌ ధోనీ రిటైర్మెంట్‌‌ గురించి ఆలోచించడం లేదని అతని చిరకాల మిత్రుడు, బిజినెస్‌‌ పార్టనర్‌‌ అరుణ్‌‌ పాండే తెలిపారు. ధోనీ లాంటి గొప్ప ఆటగాడి విషయంలో ఇలాంటి ప్రచారం జరుగుతుండడం దురదృష్ణకరమన్న అరుణ్‌‌, ఇప్పటికిప్పుడు ఆట గుడ్‌‌బై చెప్పాలని మహీ భావించడం లేదని తెలియజేశాడు. మరోవైపు సరైన సమయంలో రిటైర్మెంట్‌‌పై నిర్ణయం తీసుకునే తెలివి ధోనీకి ఉందని టీమిండియా మాజీ సెలెక్టర్‌‌ సంజయ్‌‌ జగ్దలే అన్నారు. అయితే అంతకంటే ముందు సెలెక్టర్లు ధోనీని కలిసి అతని మనసులో ఏముందో తెలుసుకోవాలని సూచించారు. అంతేకాక మహీ నుంచి ఏం కోరుకుంటున్నారో, జట్టు ఏం ఆశిస్తోందో కూడా సెలెక్టర్లు తెలియజేయాలన్నారు. ధోనీ గొప్ప ఆటగాడని, దేశం కోసం నిస్వార్థంగా ఆడాడన్నారు. ఇప్పటికిప్పుడు ధోనీకి ప్రత్యామ్నాయం దొరకడం అసాధ్యమని జగ్దలే తెలిపారు. వరల్డ్‌‌ కప్‌‌లో ధోనీ జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడాడనని, దురదృష్టవసాత్తు సెమీఫైనల్లో రనౌటయ్యాడన్నారు.