ప్రస్తుతం సామాజిక మాధ్యమ వేదికలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, వాటిలో ఉన్న సాంకేతిక సమస్యలను గుర్తించి ఆధారాలతో ఆయా సంస్థలకు పంపిస్తే బహుమతి రూ.లక్షల్లో ఉంటుందని కొందరికే తెలుసు. ఈ విషయం తెలుసుకున్న చెన్నైకి చెందిన సెక్యూరిటీ రీసెర్చర్ లక్ష్మణ్ ముత్తయ్య ఫేస్బుక్ సంస్థ నుంచి ఏకంగా రూ.20.6 లక్షలను బహుమతిగా అందుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ పాస్‌వర్డ్‌ను వినియోగదారునికి తెలియకుండా ఎలా తెలుసుకోవచ్చు? అనేది వీడియోతో సహా ఫేస్బుక్ సెక్యూరిటీ బృందానికీ పంపించాడు. దీనికి ఫిదా అయినా ఆ సంస్థ బగ్ బౌంటీ పేరిట భారీ నజరానా ప్రకటించింది.
*ఎవరీ లక్ష్మణ్ ముత్తయ్య?
చెన్నైకి చెందిన లక్ష్మణ్ ముత్తయ్య సెక్యూరిటీ రీసెర్చర్. అతను 2015లోనే వార్తల్లో నిలిచాడు. ఎవరి ఫేస్బుక్ ఖాతా నుంచి అయిన ఫొటోలను హ్యాక్ చేయవచ్చని ఫేస్బుక్ సంస్థకు నిరూపించాడు. తాను తయారుచేసిన బగ్‌ను ఆ సంస్థ సెక్యూరిటీ బృందానికి పంపించాడు. దీనిని చూసి సాంకేతిక లోపాన్ని ఆ సంస్థ వెంటనే సవరించుకుంది. లోపాన్ని తెలియజేసినందుకు లక్ష్మణ్‌కు 10వేల డాలర్లను బహుమతిగా అందించింది. దీంతో అతను బగ్ హంటర్‌గా ప్రసిద్ధి చెందాడు.
*బగ్హంటర్స్ అంటే ?
ప్రముఖ సంస్థల వెబ్సైట్స్లోని లోపాలను గుర్తించి ఆయా సంస్థలకు పంపించి ధనాన్ని ఆర్జించడమే బగ్ హంటర్స్ పని. దీనినే బగ్హంటింగ్ అంటారు. బగ్హంటర్స్ వెబ్సైట్స్లోని లోపాలను, సెక్యూరిటీకి సంబంధించిన విషయాలను ఆయా సంస్థలకు పంపిస్తుంటారు. ఇవి వాటికి నచ్చితే బగ్హంటర్స్కు బహుమతులతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాయి. బగ్హంటింగ్, ఎథికల్ హ్యాకింగ్ రెండూ వేరువేరు. ఎథికల్ హ్యాకింగ్ అంటే కంప్యూటర్ లేదా కంప్యూటర్ వ్యవస్థను హ్యాక్ చేసి సదరు వ్యవస్థ నిర్వాహకులకు సమాచారాన్ని అందివ్వడం.
*పాస్‌వర్డ్‌ను ఎలా పసిగట్టాడు?
ఇన్స్టాగ్రామ్ ఖాతాదారుని అనుమతి లేకుండా పాస్వర్డ్ రీసెట్‌ను చేయవచ్చని గ్రహించాడు. పాస్వర్డ్ రీసెట్‌ను ఉపయోగించి రికవరీ కోడ్‌ను పొందాడు. దీంతో రికవరీ కోడ్‌ను నమోదు చేసే వద్ద అంచనా కోడ్‌ను ఉపయోగించాడు. అది అసలైన ఖాతాకు సరిపోవడంతో ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతా తన ఆధీనంలోకి వచ్చింది. దీనిని ఫేస్బుక్ సెక్యూరిటీకి పంపించాడు. కొన్ని వివరాలు పూర్తిగా లేకపోవడంతో వారి దగ్గరి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తర్వాత వీడియో ఆధారంతో అన్ని వివరాలని పంపించాడు. దీంతో ఆ సంస్థ బృందం ఫిదా అయ్యి బగ్ బౌంటీ కింద రూ.20.6 లక్షలను (30వేల డాలర్లు) బహుమతిగా ప్రకటించింది. ఆ బగ్‌ను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలిగించామని తెలిపింది
మద్రాస్ ముత్తయ్యకు ఫేస్బుక్ బహుమతి
Related tags :