పసుపు పంటకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు 26న ఢిల్లీలో సమగ్ర భేటీ జరుగుతుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. ఢిల్లీలోని కృషీ భవన్‌లో జరిగే ఈ భేటీలో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, వివిధ విభాగాల అధికారులు హాజరుకానున్నారని చెప్పారు. పసుపు పంటపై విశ్లేషణ జరుగుతుందన్నారు. తనతో పాటు ముగ్గురు రైతులు పాల్గొంటారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి భేటీలో అవకాశం ఉంటుందన్నారు.
పసుపు పంటపై ఢిల్లీలో సమావేశం
Related tags :