‘దేవి 2’ చిత్రం తర్వాత తెలుగులో బిజీ హీరోయిన్గా మారిపోయ్యారు తమన్నా. అక్కడ సైరాతో పాటు రెండు సినిమాల్లో నటిస్తున్నారు. తమిళంలో విశాల్కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘అదే కన్గల్’ ఫేమ్ రోహిత్ వెంకటేశన్ దర్శకత్వంలోని ఓ సినిమాలో తమన్నా నటించనుంది. థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో ఈ అమ్మడు కీలకపాత్ర పోషిస్తోంది. యోగిబాబు, మునీష్కాంత్, సత్యన్ తదితరులు ఇతర తారాగణం. సినిమాకు ‘పెట్రోమాక్స్’ అని పేరు పెట్టారు. ఈ సినిమా ఫస్ట్లుక్ను నటి తాప్సీ ట్విట్టర్లో విడుదల చేసింది. ఓ కుర్చీలో తమన్నా తలకిందులుగా కూర్చుని ఉన్నట్లు ఫస్ట్లుక్ ఉంది. వెనుక ఆమెను చూసి యోగిబాబు, మునీష్కాంత్లు భయపడుతున్నారు. అయితే ఇది కూడా ‘దేవి’ మాదిరిగా దెయ్యం చిత్రమేనా అని ప్రేక్షకులకు సందేహం కలుగుతోంది. త్వరలోనే మరిన్ని పూర్తి వివరాలు వెల్లడించనుంది చిత్ర బృందం.
పెట్రోమాక్స్
Related tags :