‘నేను ఓ సెలబ్రిటీతో డేటింగ్ చేశా. దాన్ని ఈ ప్రపంచం కనిపెట్టలేకపోయింది’ అంటున్నారు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. ఈ భామ చిత్ర పరిశ్రమకు వచ్చి తొమ్మిదేళ్లు కావొస్తున్నా ప్రేమ, జీవితం గురించి మీడియా ఎదుట అంతగా మాట్లాడలేదు. కాగా, ఆమె తాజాగా ఓ ఛాట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘చిత్ర పరిశ్రమకి సంబంధించిన వారితో డేటింగ్‌పై మీ అభిప్రాయం ఏంటి?’ అని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను మంచి కుర్రాడిని ప్రేమించాలనేది నా తల్లిదండ్రుల కోరిక. కానీ, చిత్ర పరిశ్రమలో అలాంటి వారు లేరు. గతంలో నేను ఇండస్ట్రీకి చెందిన ఓ సెలబ్రిటీతో డేటింగ్ చేశా. కానీ ఈ ప్రపంచం దాన్ని కనిపెట్టలేకపోయింది’ అని చెప్పారు.సోనాక్షి.. బంటీ సజ్‌దేతో ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ ఒకప్పుడు కోడై కూసింది. ఈ వదంతులకు తగ్గట్టే వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, బహిరంగంగా తిరుగుతూ మీడియా కంటపడ్డారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరిద్దరూ ఒక ఇంటివారు కాబోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని సోనాక్షి స్పష్టం చేశారు. అలాంటిది ఏమైనా ఉంటే స్వయంగా ప్రకటిస్తానని చెప్పారు. ఇలాంటి వదంతుల్ని ఎందుకు సృష్టిస్తారో అర్థం కాదని విస్తుపోయారు.
పసిగట్టలేకపోయారు
Related tags :