సీపీఐ నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఏకగ్రీవ ఎన్నికయ్యారు.
డి.రాజా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సురవరం సుధాకర్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు.
దీనికి అన్ని రాష్ట్రాల కార్యదర్శులు మద్దతు తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా కన్హయ్య కుమార్‌ను ఎన్నుకున్నారు.
కాగా, జాతీయ కౌన్సిల్ ముగింపు సమావేశంలోనే రాజా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
*** రాజా విశేషాలు…
తమిళనాడుకు చెందిన రాజా.. 1995 నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఢిల్లీ నుంచి పని చేస్తున్నారు.
యువజన ఉద్యమాల నుంచి క్రియాశీలక రాజకీయాలలోకి వచ్చిన రాజా.. 1985లో సీపీఐ యువజన విభాగానికి అధ్యక్షుడు గా పని చేశారు.
తమిళనాడులో పలు ఉద్యమాలకు నేతృత్వం వహించారు. రెండవ సారి పార్టీ ఎంపీగా రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు.