ఇన్‌కాగ్నిటో మోడ్. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్‌లు వాడే వారికి తెలిసిందే. సీక్రెట్‌గా ఇంటర్నెట్లో ఏం సెర్చ్ చేయాలన్నా నెటిజన్లు ఉపయోగించేది ఇదే.
ముఖ్యంగా పోర్న్ వీడియోలు చూసేందుకు చాలా మంది దీన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఇన్ కాగ్నిటో మోడ్‌లో చేసిన సెర్చ్ సేఫ్ అనుకుంటే పొరపాటే.
గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలు రహస్యమనుకునే ఈ సమాచారాన్ని సైతం సేకరిస్తున్నాయని తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఇంటర్నెట్లో మనం చేసే ప్రతి పనిపై నిఘా కొనసాగుతోందన్న విషయం తాజాగా వెల్లడైంది.
ముఖ్యంగా గూగుల్, ఫేస్ బుక్, ఒరాకిల్ క్లౌడ్లు నెటిజన్లు చూసే ప్రతి పోర్న్ వీడియో సైట్‌నే కాదు.. ప్రతి కదలికను గమనిస్తున్నాయి.
ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్, కార్నెగో మెల్లన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్ేనియా సైంటిస్తులు తమ అధ్యయనంలో తేల్చారు.
వెబ్ ఎక్స్ రే అనే టూల్ సాయంతో 22,484 ఆశ్లీల వెబ్ సైట్లను పరిశీలించిన సైంటిస్టులు 93శాతం పేజీల ట్రాకింగ్ జరిగినట్లు గుర్తించారు.
అశ్లీల వెబ్ సైట్లు చూసే వారి వివరాలు సేకరిస్తున్న టాప్ 10 సైట్లలో ఎక్సో క్లిక్ (40శాతం), జ్యూసీ యాడ్స్ (11శాతం), ఎరో అడ్వర్టైజింగ్ (9శాతం) ఉన్నాయి.
అశ్లీల వెబ్ సైట్లు కాకుండా ఇతర సైట్లు చూసే వారి వివరాలను గూగుల్ 74 శాతం, ఒరాకిల్ 24శాతం, ఫేస్ బుక్ 10శాతం సేకరించింది.
అలా కలెక్ట్ చేసిన డేటాను ఆయా కంపెనీలు థర్డ్ పార్టీ సంస్థలకు అందజేస్తున్నాయి. అయితే అవి ఏ కంపెనీలన్న విషయాన్ని మాత్రం రీసెర్చర్లు బయటపెట్టలేదు.
2017లో 30 బిలియన్ల మంది పోర్న్ సైట్లు చూశారని రీసెర్చర్లు తేల్చారు. ఆశ్లీల సైట్ల కోసం వెతికే వారి సంఖ్య ప్రతి సెకనుకు 50 వేల వరకు ఉందని ప్రకటించారు.
టోటల్ నెట్ ట్రాఫిక్‌లో మూడింట ఒక వంతు ట్రాఫిక్ పోర్న్ సైట్లదేనని సైంటిస్టులు చెబుతున్నారు.
ఆన్‌లైన్ మార్కెట్ దిగ్గజాలైన నెట్ ఫ్లిక్స్, అమెజాన్, ట్విట్టర్ మూడింటికి వచ్చే ట్రాఫిక్ కన్నా ఇది ఆరు రెట్లు కావడం విశేషం
ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఆశ్లీల వీడియోలు చూసిన సేఫ్టీ లేదన్న వార్తలు ఇంటర్నెట్ యూజర్లను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇన్నాళ్లు సేఫ్ మోడ్ అనుకున్నది అంత భద్రమైందేమీ కాదని తేలడంతో చాలా మంది షాకయ్యారు.
తమ వ్యక్తిగత సమాచారాన్ని గూగుల్, ఫేస్‌బుక్‌లు ఎవరికి ఇస్తున్నాయి. ఆ డేటా ఎవరి చేతుల్లోకి వెళ్తోందన్న టెన్షన్ యూజర్లలో మొదలైంది.