Agriculture

ఏపీ తెలంగాణాల్లో భారీ వర్షాలు

Heavy Rains In Andhra And Telangana Due To Monsoons - ఏపీ తెలంగాణాల్లో భారీ వర్షాలు

రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఇవాళ, రేపు తెలంగాణ, ఏపీలలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. నిన్న హైదరాబాద్, వరంగల్, కర్నూల్, గుంటూరు, ప్రకాశం, నిజామాబాద్, పశ్చిమ గోదావరి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షం పడిందని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండడం, ఆగ్నేయ బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అటు విశాఖపట్నం వాతావరణ కేంద్రం కూడా తెలిపింది.