Politics

పాతబస్తీలో కిషన్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత

పాతబస్తీలో కిషన్‌రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత - Kishan Reddy Trip To Old City In Hyderabad Rises Tensions

పాతబస్తీలోని ఆసిఫ్‌నగర్‌లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. కిషన్‌రెడ్డి ఆదివారం ఆసిఫ్‌నగర్‌లో పర్యటిస్తున్న సమయంలో.. ఓ యువకుడు ఆయన ఫ్లెక్సీలను తగలబెట్టాడు. దీంతో పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కిషన్‌రెడ్డి ఫ్లెక్సీలను తగలబెట్టిన యువకుడిని పట్టుకొని బీజేపీ శ్రేణులు చితకబాదాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆసిఫ్‌నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.