ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో సీఎం జగన్ వైఖరి సరికాదని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి విమర్శించారు.
హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పినా ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం తెచ్చిన గ్రామ సచివాలయ విధానంతో అనేక మందికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.
రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇసుక, మట్టి విధానంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు.
ఇసుకపై నిషేధం విధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.