ఇండోనేషియా ఓపెన్ ఫైనల్లో సింధు ఓడిపోయింది. రన్నరప్ ట్రోఫీతోనే సరిపెట్టుకుంది. ఫైనల్ ఫోబియాను అధిగమించలేకపోయింది. యమగుచి చేతిలో ఖంగు తిన్నది.
15-21, 16-21 స్కోర్ తేడాతో సింధు ఓడిపోయింది. ఫైనల్‌లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సింధు అంచనాలను అందుకోలేకపోయింది. జపాన్ షట్లర్ ఆట ముందు తేలిపోయింది.
ఆరంభంలో పోటీ ఇచ్చిన.. తర్వాత తడబడింది. మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇండోనేషియా ఓపెన్‌లో సింధు ఫామ్‌ను కొనసాగించలేకపోయింది. ఒత్తిడికి చిత్తయింది.
యమగుచి హద్దుల్ను దాటలేకపోయింది. ఇండోనేషియా టైటిల్ డ్రీమ్‌ను నెరవేర్చుకోలేకపోయింది.