చాలామంది పెట్టీకోట్ చీరకు మ్యాచ్ అయ్యిందా లేదా అనే చూసుకుంటారు తప్ప… ఇంకేమీ ఆలోచించరు. ఈ రోజుల్లో వీటిల్లోనూ రకరకాల డిజైన్లు వచ్చాయి. స్లిమ్ పెట్టీకోట్స్ అని ఉంటాయి. వీటి డిజైను పిరుదుల నుంచీ వెడల్పుగా కాకుండా సన్నగా వస్తుంది. షేప్‌వేర్ పెట్టీకోట్‌్స మరో రకం. అంటే మీరు ఎలా ఉన్నా…చీరకట్టుకున్నాక తీరైన శరీరాకృతిలో కనిపించేలా చేస్తాయివి. కుర్తాలకు రెండువైపులా చీలికలు ఉన్నట్లు…కొన్ని ఇప్పుడు చీలికలతో వస్తున్నాయి. దానివల్ల కొంత సన్నగా కనిపిస్తారు. ఒకవేళ మీరు నెట్టెడ్ చీరల్ని కట్టుకుంటుంటే… జతగా ఏదో ఒకటి కాకుండా మెరిసే శాటిన్ రకాలూ దొరుకుతాయి. వాటివల్ల నిండుగా కనిపిస్తారు. ఇవన్నీ పలు రంగుల్లోనూ దొరుకుతున్నాయి కాబట్టి మీకేది నప్పుతుందో దాన్ని ఎంచుకోవడం మంచిది.
చీరలో సన్నగా కనపడాలంటే…
Related tags :