ఉల్లికాడలను (స్ర్పింగ్ ఆనియన్) సలాడ్స్, సూప్లో డ్రెస్సింగ్ కోసం, రుచికోసం వాడతార తప్ప వంటల్లో అంతగా ఉపయోగించం. లేత, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే వీటిలో ఆరోగ్య గుణాలు మెండుగా ఉంటాయి. వీటిని తింటే ఫైబర్, సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే ఉల్లిపొరకతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటంటే..వీటిలో ఫైబర్, ఎ, బి, సి విటమిన్లు, ఫోలేట్తో పాటు పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి లవణాలు అధికంగా ఉంటాయిఉల్లికాడల్లోని ఎ, సి విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతాయి.వీటిని సలాడ్స్, సూప్లోనే కాకుండా కూర వండినా రుచిగా ఉంటుంది. ఇవి శరీరానికి సూక్ష్మపోషకాలను అందించడమే కాదు జీవక్రియల్ని నియంత్రిస్తాయి కూడా.వీటిలో కావల్సినంత ఫైబర్ లభిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఉల్లికాడలు మంచి డైట్.అల్లిసిన్ అనే రసాయనం చర్మం ముడతలు పడకుండా చూస్తుంది.ఉల్లిపొరకలోని సల్ఫర్ రక్త పీడనాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇన్సులిన్ ఉత్పత్తి పెంచి, తద్వారా రక్తంలో చక్కెర నిల్వలు పెరగకుండా చూస్తుంది.వీటిలో లభించే అలైల్ సల్ఫైడ్ ఫ్రీరాడికల్స్ బయటకు పంపుతుంది. కేన్సర్ కణాలను ఉత్పత్తి చేసే ఎంజైమ్ల విడుదలను నిలిపివేస్తుంది. ఉల్లికాడల్లోని కె, సి విటమిన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గణాలు ఈ కాలంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గును నివారిస్తాయి.ఉల్లి పొరకలో కంటి ఆరోగ్యానికి మేలు చేసే కెరొటినాయిడ్స్, ఎ విటమిన్ అధికంగా ఉంటాయి. వీటిలోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
ఉల్లికాడలు అన్నింటిలో వేసుకుని తినండి
Related tags :