ఒక దేశ ప్రధాని మరో దేశంలో అడుగుపెడుతున్నారంటే ఆయనకు ఆత్యున్నత స్థాయి వ్యక్తులు స్వాగతం పలకడం రివాజు. అలా జరగలేదంటే సదరు ప్రధాని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనట్టే. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌కు సరిగ్గా ఇటువంటి పరిస్థితులే ఎదురైనట్టు సమాచారం. అమెరికాలో ల్యాండైన అనంతరం ఇమ్రాన్‌కు స్వాగతం పలికేందుకు ఆమెరికాకు చెందిన ఉన్నత స్థాయి వ్యక్తులెవరూ రాలేదని తెలుస్తోంది. ప్రోటోకాల్ పాటించేందుకు మాత్రం అమెరికా ప్రభుత్వం ఓ అధికారిని పంపించి అక్కడితో సరిపెట్టినట్టు తెలుస్తోంది. పాక్ విదేశాంగ శాఖ మంత్రి, మరి కొందరు పాక్ ఉన్నతాధికారులు మాత్రమే ఇమ్రాన్‌కు స్వాగతం చెప్పేందుకు వెళ్లారని సమాచారం.
హే ఖుదా…యే క్యా కియా?
Related tags :