Food

బ్లాక్ కాఫీ ఈజ్ గుడ్ కాఫీ

Black coffees is the best and healthiest coffee

బ్లాక్ కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. రోజూ ఉదయం ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకుంటే మెదడు, నరాల పనితీరు మెరుగుపడటంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వయసుతో పాటు వచ్చే మతిమరుపు సమస్యలూ అదుపులో ఉంటాయి. పొద్దున్నే నడక, పరుగుతోపాటు ఇతర వ్యాయామాలు చేసేవారు కప్పు బ్లాక్ కాఫీ తాగడం మంచిది. వ్యాయామాలు చేయడానికి అరగంట ముందు దీన్ని తీసుకుంటే శరీరం, మెదడు ఉత్తేజితమై ఎక్కువ సేపు వ్యాయామం చేయడానికి అవసరమైన శక్తి అందుతుంది. శారీరక శ్రమకు మెదడును సిద్ధం చేస్తుంది.బ్లాక్ కాఫీలో ఉండే విటమిన్ బి2, బి3, బి5తో పాటు మాంగనీసు, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు సహజ రోగ నివారిణిగా పనిచేస్తాయి. మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, కడుపులో మంట వంటివి తగ్గుముఖం పడతాయి.బ్లాక్ కాఫీతో డోపమైన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వయసుతో పాటు కనిపించే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.బ్లాక్ కాఫీకి కొవ్వును కరిగించే గుణం ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. పంచదార లేకుండా దీన్ని తాగితే…శరీరంలోని వ్యర్థాలు, విషపూరిత బ్యాక్టీరియాల్ని మూత్రంతో పాటు బయటకు పంపుతుంది.రోజూ కనీసం రెండు కప్పుల బ్లాక్కాఫీ తాగేవారిలో కాలేయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు 80శాతం మేర తగ్గుతాయని అధ్యయనాలు వెల్లడించాయి. కాలేయ, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనూ నివారించవచ్చు.