Health

వర్షాకాలం ఇన్ఫెక్షన్లా?

Here are some tips to beat infectious diseases of feet in rainy season

వర్షాకాలంలో చాలామందిని పాదాల పగుళ్లూ, ఇన్ఫెక్షన్లూ బాధిస్తుంటాయి. అలాంటి వారు ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తే సమస్యలు ఇట్టే దూరమవుతాయి.
* ఎప్పుడైనా పాదాలను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచిది. వర్షంలో తడిసిన ప్రతిసారీ యాంటీబ్యాక్టీరియల్ లోషన్ కలిపిన నీళ్లలో పాదాలను కాసేపు ఉంచి కడిగేసుకుంటే ఎలాంటి చర్మసంబంధిత సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి.
* మూడు చెంచాల గులాబీనీళ్లలో రెండు చెంచాల నిమ్మరసం, చెంచా గ్లిజరిన్ కలిపి కాళ్లకు రాసుకోవాలి. గంటయ్యాక కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే పాదాలు మృదువుగా ఉంటాయి.
* బకెట్ నీళ్లలో మూడు చెంచాల తేనె, చెంచా హెర్బల్ షాంపూ, రెండు చెంచాల బాదం నూనె వేసి పాదాలను ఉంచాలి. ఇరవై నిమిషాల తరవాత చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే పొడిబారకుండా ఉంటాయి.
* ఆలివ్ నూనె, యూకలిప్టస్ ఆయిల్, రోజ్మేరీ నూనె, రోజ్ ఆయిల్ తీసుకుని ఒక బాటిల్లో నిల్వ చేసుకోవాలి. ఈ మిశ్రమంతో ప్రతిరోజూ పాదాలను మర్దన చేసుకుంటే రక్తప్రసరణ బాగా జరిగి చర్మం మృదువుగా మారుతుంది. ఒత్తిడీ దూరమవుతుంది.