Movies

జాక్వెలిన్ ఛానెల్

jacqueline Fernandez Opens Her Own Youtube Channel

సొంత యూ ట్యూబ్ చానెల్స్ను స్టార్ట్ చేసి ఆడియన్స్ ఫాలోయింగ్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు బాలీవుడ్ భామలు. ఇటీవల స్టార్ హీరోయిన్ ఆలియాభట్ తన సొంత యూ ట్యూబ్ చానెల్ను స్టార్ట్ చేసి, తన ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మరో బీటౌన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా యూ ట్యూబ్ చానెల్ను షురూ చేశారు. ‘‘బాలీవుడ్లో నా జర్నీలో భాగంగా నేర్చుకున్న కొత్త విషయాలను నా యూ ట్యూబ్ చానెల్లో పంచుకుంటాను. ముఖ్యంగా ఫిట్నెస్, బ్యూటిప్స్ విషయాలను కూడా చెప్పాలనుకుంటున్నా. ఇండస్ట్రీలో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. వారితో వారికి చెందిన ఇన్స్పైరింగ్ స్టోరీస్ను చెప్పించాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు జాక్వెలిన్ ఫెర్నాండెజ్.