1. సెప్టెంబరు 2 నుంచి కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలు – ఆద్యాత్మిక వార్తలు
చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు సెప్టెంబరు 2 నుంచి 22 వరకు 21 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సెప్టెంబరు 2న వినాయకచవితి; 3న ఉదయం ధ్వజారోహణం; రాత్రి హంసవాహనం; 4న నెమలి; 5న మూషిక; 6న ఉదయం చిన్నశేష, రాత్రి పెద్ద శేష వాహన సేవ; 7న వృషభ; 8న గజ; 9న రథోత్సవం; 10న తిరుకల్యాణం, అశ్వవాహనం; 11న ధ్వజావరోహణం, వడాయత్తు ఉత్సవం, ఏకాంతసేవలతో స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. సెప్టెంబరు 12 నుంచి 22 వరకు 11 రోజులపాటు స్వామివారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయని వివరించారు.
2. మహంకాళికి భక్తజన బోనం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆషాఢ మాస బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా మహిళలు అమ్మవారికి బోనం, సాక సమర్పించడం ఆరంభించారు. దివ్య మంగళ స్వరూపిణిగా అలంకృతమైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో నలువైపులా ఏర్పాటు చేసిన క్యూలైన్లు కిక్కిరిశాయి. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం అమ్మవారిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ తదితరులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్గౌడ్, మల్లారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు రేవంత్రెడ్డి, బీబీ పాటిల్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్గౌడ్, బీసీ కమిషన్ ఛైర్మన్ రాములు తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
3. శ్రీవారి సేవలో జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
4. హజ్యాత్ర విమాన ప్రయాణ తేదీలు ఖరారు
హజ్యాత్ర-2019 విమాన ప్రయాణ తేదీలు ఖరారైనట్లు మైనారిటీ శాఖ మంత్రి అంజద్బాషా తెలిపారు. ప్రయాణ వివరాలను యాత్రికులు దరఖాస్తులో పేర్కొన్న మొబైల్నంబర్కు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా సమాచారం పంపుతుందని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాచారం అందిన వెంటనే ఆన్లైన్లో విమాన టికెట్ల బుకింగ్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం జిల్లా హజ్ సొసైటీల సాయం తీసుకోవాలని తెలిపారు.
5. హజ్యాత్ర విమాన షెడ్యూల్ ఖరారు
2019 హజ్ యాత్ర విమాన షెడ్యూల్ ఖరారైంది. టెక్నాలజీని ఉపయోగించుకొని తక్కువ సమయంలో కావాల్సిన పనులు చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజద్బాషా హజ్ యాత్రికులకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఏ విమానంలో ఏ తేదీన ప్రయాణం చేయనున్నారో ఆ సమాచారాన్ని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్ యాత్రికులు దరఖాస్తులో పేర్కొన్న ఫోన్ నంబర్కు మెసేజ్ చేస్తుంది. మెసేజ్ వచ్చిన వెంటనే హజ్ యాత్రికులు తమ సెల్ఫోన్ ద్వారా ఆన్లైన్లో విమాన బుకింగ్ నిర్ధారణ చేసుకోవాలి. అర్థం కాకపోతే సమీపంలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కు వెళ్లి చేసుకోవచ్చు. లేదా జిల్లా హజ్ సొసైటీల సాయం తీసుకోవాలని ఏపీ స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తాజుద్దీన్ ఆరీఫ్ హజ్ యాత్రికులకు సూచించారు. ఆన్లైన్ విమాన బుకింగ్ను నిర్ధారణ చేసుకోవడం వల్ల తమ ప్రయాణానికి 48 గంటల ముందే నాంపల్లి హజ్హౌస్కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం 10 గంటల ముందు వెళ్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ యాత్రికులు వెళ్లే మొదటి విమానం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5375 జూలై 31న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జెద్దా బయలు దేరనుంది. ఈ విమానంలో గుంటూరుకు చెందిన 207 మంది, కృష్ణా జిల్లాకు చెందిన 113 మంది, విశాఖపట్నం ఇద్దరు, పశ్చిమగోదావరికి వాసులు 20 మంది కలిపి మొత్తం 342 మంది వెళ్లనున్నారు. ఆగస్టు 1న మధ్యాహ్నం 12:45 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5383 విమానంలో 343 మంది యాత్రికులతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జెద్దా బయలుదేరనుంది. ఈ విమానంలో తూర్పుగోదావరి నుంచి నలుగురు, గుంటూరు జిల్లాకు చెందిన 85 మంది, కృష్ణ్లాకు చెందిన 75 మంది, కర్నూలు 111, నెల్లూరు 19, ప్రకాశం 10, విశాఖపట్నం 23, విజయనగరం జిల్లాకు చెందిన 16 మంది ప్రయాణికులు వెళ్తారు. ఆగస్టు 2న మధ్యాహ్నం 12:55 గంటలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5391 విమానంలో కర్నూలు జిల్లాకు చెందిన 268 మంది యాత్రికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జెద్దా వెళ్తారు. ఆగస్టు 3న మధ్యాహ్నం 12:55 నిమిషాలకు ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–5403 విమానంలో తూర్పుగోదావరికి చెందిన 28 మంది, కడపకు చెందిన 199 మంది, కర్నూలు 31, నెల్లూరు ఐదుగురు, శ్రీకాకుళం నలుగురు, విశాఖపట్నం 55, విజయనగరం నలుగురు, పశ్చిమగోదావరికి చెందిన 17 మంది.. మొత్తం 343 మంది హజ్ యాత్రకు వెళ్తారు. ఆగస్టు 3న మధ్యాహ్నం 12:55 గంటలకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ–5397లో హైదరాబాద్ నుంచి ఆరుగురు, కడప 11, కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు, కర్నూలు 10, నెల్లూరు 64, ప్రకాశం 26, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్కు చెందిన 163 మంది, కలబుర్గీ 20, రాయచూర్ 5, యాదగిరికి చెందిన 31 మంది.. మొత్తం 341 మంది హజ్ యాత్రకు ఈ విమానంలో వెళ్లనున్నారు.
6. ఆగస్టు 9న తిరుచానూరులో వరలక్ష్మీవ్రతం
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9వ తేదీన ఉదయం 10 నుంచి 12గంటల వరకు వరలక్ష్మీవ్రతం ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. సాయంత్రం 6గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. వ్రతం కారణంగా 9న ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ సేవలతో పాటు ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది.
7. భద్రాద్రి రామయ్యకు వైభవంగా పూజలు
భద్రాచలం రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఉచిత దర్శనాలకు చాలాసేపు బారులుదీరి నిలబడాల్సి వచ్చింది. ప్రసాదాల కౌంటర్లో రద్దీ నెలకొంది. ప్రధాన కోవెలలో సుప్రభాత సేవ ఘనంగా నిలువగా అర్చకులు ఆరాధించి అభిషేక మహోత్సవాన్ని కొనసాగించారు. ఇందులో పాల్గొనేందుకు పరిమిత సంఖ్యలో భక్తులకు ప్రవేశం ఉండటంతో ఉదయమే కోవెల వద్దకు చేరుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అభిషేకంలో పాల్గొన్న వారు స్వామి వైభవాన్ని కళ్లారా వీక్షించి జైశ్రీరామ్ అంటూ నీరాజనాలు అందించారు. మూల విరాట్కు బంగారు పుష్పాలతో అర్చన చేయడంతో వీక్షించి పులకించిపోయారు. వారానికి ఒక్కసారి ఉండే క్రతువు కావడంతో విశేష సంఖ్యలో తరలి వచ్చి దేవదేవుణ్ని దర్శించుకున్నారు. క్షేత్ర విశిష్టత పరమానందం కలిగించగా వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేన పూజ చేసి పుణ్యాహ వాచనం కొనసాగించి కంకణాల ధారణను కడు రమణీయంగా నిర్వహించారు. వధూవరుల గోత్రనామాలను చదివి ప్రవరను పఠించి సీతమ్మకు యోక్త్రాన్ని రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగళ్య ధారణ మంత్రముగ్ధమైంది. తలంబ్రాల వేడుక ఆనందడోలికల్లో ముంచెత్తింది. అర్చకులు నిత్య కల్యాణ క్రతువు గురించి వివరిస్తుండగా దీనికి అనుగుణంగా నిర్వహించిన కల్యాణం కనులకు పండుగగా కనిపించింది. దర్బారు సేవ తన్మయత్వంలో ముంచెత్తింది. నేడు ముత్తంగి రూపంలో స్వామి వారి దర్శనం ఉంటుందని వైదిక పెద్దలు తెలిపారు.
8. ఉజ్జయిని అమ్మవారి ఊరేగింపు ప్రారంభం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారి ఊరేగింపు ప్రారంభమైంది. దీనికోసం కర్ణాటకలోని గుల్బర్గా నుంచి మేనక అనే ఏనుగును అధికారులు తీసుకొచ్చారు. గతంలోనూ రాష్ట్రంలో జరిగిన పలు వేడుకల్లో మేనక పాల్గొంది. అంబారీ ఊరేగింపుతో అమ్మవారి బోనాల ఉత్సవాలు ముగియనున్నాయి.అంతకుముందు ఆలయంలో ఏర్పాటు చేసిన రంగం కార్యక్రమంలో జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది ఉత్సవాలు తననెంతో సంతోషపెట్టాయని అన్నారు. ప్రజలంతా సంతోషంగా ముడుపులు చెల్లించుకున్నారని చెప్పారు. భక్తులు సమర్పించిన ముడుపులను సంతోషంగా అందుకున్నానని అన్నారు. వర్షాలు తప్పకుండా కురుస్తాయని భరోసా ఇచ్చారు. ‘‘నా బిడ్డలను సంతోషంగా ఉంచే బాధ్యత నాదే. నాకు పూజలెందుకు ఆపుతున్నారు. బోనం మాత్రం తప్పకుండా సమర్పించాలి. ప్రజలందరినీ సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నాను. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి. అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుంది. ఐదువారాలపాటు పప్పు, బెల్లంతో శాఖలు సమర్పించండి. మారు బోనం తప్పకుండా సమర్పించండి..ఎలాంటి ఆపద రానివ్వను’’ అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
9. ప్రహ్లద సమేత స్వయంభూగా వేలశి యున్నక్షేత్రము శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము*
కదిరి పట్టణము – 515591, అనంతపురము జిల్లా., ఆంధ్రప్రదేశ్
ఫోన్ నెం : 08494 – 221066, 221366
email: ac_eo_kadiri@yahoo.co.in
22.07.2019 వతేది, *సోమవారము ఆలయ సమాచారం*
*శ్రీస్వామి వారి దర్శన వేళలు
ఉదయము 5.30 గంటలకై అలయము శుద్ది, మొదటి మహాగంట, నివేదన, బాలబోగ్యం త్రికల నైవేద్యాములు సమర్పణ. పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నివేదనసమర్పణ..స్వామి వారి దర్శనము ఉదయము 6.00 గంటల నుండి 7.30 గంటలకు వుండుఅనంతరము ఉదయం 7.30 గం|| నుండి స్వామివారికి అర్జిత అభిషేక సేవ ప్రారంభమగును. స్వామి వారికి *_ఆర్జిత అభిషేకము_* సేవా, సహస్రనామర్చన, పుష్ప అలంకరణ, మహా మంగళ హారతితో పాటు నివేదిన, ప్రసాదము నైవేధ్యము సమర్పణ కార్యకమమును ( ఉదయము 7.30 గంటలనుండి 9.30 గంటల వరకు ) నిర్వహించెదరు…దేవస్థానమునకు అనుభంద అలయమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి (శివాలయములో) ఆషాడా బహుళ పంచమి రోజున అనగా 22.07.2019వతేది సోమవారము వరుణ యాగము, విరాటపర్వ పారయణము మరియు సహస్ర ఘటాభిషేకము, గణపతి పూజ వరుణ కలశ స్థాపన, పర్జన్య, వారుణ శతానువాక, వరుణ జపము, రూద్రాబిషేకము, పంచామృత అభిషేక సేవా తదితర పూజధికార్యక్రమములు నిర్వహింబడును తిరిగి సర్వ దర్శనము ఉదయము 10.00 గంటల నుండి మ. 12.00 వరకు వుండును..రెండవ మహాగంట నివేదనమ.12.00 నుండి 12.30 లోపు, బాలబోగ్యం త్రికల నైవేద్యాము సమర్పణ..మ. 12.40 నుండి 2.00 వరకు సర్వదర్శనము.. అనంతరము ఆలయము తలుపులు మూయబడును..తిరిగి సాయంత్రము శ్రీస్వామి వారి దర్శనార్థము 4.30 గంటలనుండి రా.6.00 వరకు వుండును.. మూడవ మహా గంట ఆలయ శుద్ది, నివేదన రా.6.30 నుండి 7.00 లోపు, బాల బోగ్యం త్రికల నైవేద్యాదులు సమర్పణ. మహ మంగళ హారతి, పరివారదేవతలకు (చుట్టువున్నఆలయములకు) నైవేద్యాములు సమర్పణ.. తిరిగి శ్రీస్వామి వారి దర్శనార్థము రాత్రి 7.00 గంటల నుండి రా.8.30 వరకు వుండును.. రాత్రి 8.30 గంటల పైన ఆలయ శుద్ది అనంతరము, స్వామి వారికి ఏకాంత సేవాతో స్వామి వారి దర్శనము పరిసమప్తం అగును, తదుపరి ఆలయము తలుపులు ముయాబడును..
*ఆర్జిత సేవాల వివరములు
22.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) ఆర్జిత అభిషేకము సేవా టిక్కెట్లు బుకింగ్: 18*_
22.07.2019 తేదికి (ఈ రోజు సా.7.00 వరకు) అర్జిత స్వర్ణకవచ సేవా టిక్కెట్లు బుకింగ్: 3*_
21.07.2019 వ తేదిన శ్రీవారి *నిత్యఅన్నదాన పథకము* నకు భక్తులు విరాళముగా :34,500/- సమర్పించియున్నారు.
21.07.2019 వ తేదిన శ్రీవారి నిత్య అన్నదాన పథకము నందు *_అన్నప్రసాదము స్వీకరించిన_* భక్తుల సంఖ్య: 670 మంది స్వీకరించినారు.
21.07.2019 వ తేదిన స్వామి వారికి మొక్కుబడిగా *తలనీలాలు సమర్పించిన భక్తుల* సంఖ్య: 195 మంది
21.07.2019 వ తేదిన *వసతి గదులు* బుకింగ్ సంఖ్య : 10
10. శ్రీరస్తు శుభమస్తు
*తేది : 22, జూలై 2019*
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
లము : వేసవికాలం
వారము : ఇండువాసరే (సోమవారం)
పక్షం: కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పంచమి
(నిన్న ఉదయం 11 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 4 ని॥ వరకు పంచమి తిధి తదుపరి షష్ఠి తిధి)
నక్షత్రం : పూర్వాభద్ర
(నిన్న ఉదయం 7 గం॥ 25 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 10 గం॥ 24 ని॥ వరకు పూర్వాభాద్ర నక్షత్రం తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం)
యోగము : (శోభనం ఈరోజు ఉదయం 7 గం ll 17 ని ll వరకు తదుపరి అటిగండం రేపు ఉదయం 8 గం ll 9 ని ll వరకు)
కరణం : (కౌలవ ఈరోజు తెల్లవారుఝామున 0 గం ll 53 ని ll వరకు)
(తైతుల ఈరోజు మద్యాహ్నము 2 గం ll 4 ని ll వరకు)
అభిజిత్ : (ఈరోజు మద్యాహ్నము 12 గం ll 23 ని ll )
వర్జ్యం : (ఈరోజు రాత్రి 9 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 55 ని॥ వరకు)
మ్రుతఘడియలు : (ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 11 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 27 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 10 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 2 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 33 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 9 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
మగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 23 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 37 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మీనము
11. శుభోదయం*
*మహానీయుని మాట*
మంచివారికి నియమాలు పాటించమని చెప్పాల్సిన పని లేదు. చెడ్డవారికి చెప్పీ ప్రయోజనం లేదు.”
12. నేటీ మంచి మాట*
“కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి.”
13. నేటి సుభాషితం*మనము గతము గురించి కోపంగా ఉండకూడదు, భవిష్యత్ గురించి చింతించకూడదు, వివేచనగలవారు ప్రస్తుత క్షణంతో మాత్రమే వ్యవహరిస్తారు*
*— చాణుక్యుడు*
14. నేటి జాతీయం
కాకమ్మ కథలు చెప్పకు*ని పోని విషయాలుఉపయోగంలేని మాటలు మాట్లాడొద్దు. అని అర్థం.
కల్పితాలు చెప్పేవారిని ఇలా అంటారు.
15. నేటి ఆణిముత్యం
మంచి వ్యక్తి యంచు మనసార పెండ్లాడి
జీవితాన తృప్తి చెందవలదు,
బ్రతుకు బాటలోన పరమహితము గోరు
వారి నెన్నుకొనుటె వరగుణంబు
*భావము:*
మంచి వ్యక్తితో పెండ్లి జరిగినదని ఎవరూ సంతోషంతో పొంగిపోరాదు. ఇరువురి బ్రతుకు బాటలో హితము జేయు వారినే ఎన్నుకొనుట మంచిది.
16. మన ఇతిహాసాలు
“అశ్వహృదయం” అను విద్య తెలిసినవారు ఎవరు
అశ్వహృదయం అంటే గుర్రాలను నియత్రించే మంత్రం. శ్రీకృష్ణునికి అశ్వహృదయ విద్య తెలుసునని, ఆ విద్యను సైంధవ వధనాడు ప్రదర్శించాడనీ, నకులునికి అశ్వశిక్షణ బాగా తెలుసునని మహాభారతం ద్వారా మనకు తెలుస్తోంది.
17. చరిత్రలో ఈ రోజు/జూలై 22*-రాగతి పండరి
1922 : ప్రముఖ సంస్కృతాంధ్ర కవయిత్రి, సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు సతీమణి పుట్టపర్తి కనకమ్మ జననం (మ.1983).
1923 : భారతీయ హిందీ సినిమా రంగం నేపథ్య గాయకుడుముకేష్ జననం (మ.1976).
1925 : తెలంగాణ ప్రజల కన్నీళ్లను ‘అగ్నిధార’గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య జననం (మ.1987).
1944 : పోలండ్ జాతీయదినోత్సవం.
1947 : పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం భారత జాతీయపతాకముగా అమోదం పొందింది.
1965 : తెలుగు వ్యంగ్య చిత్రకారులు/కార్టూనిస్టులలో కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి జననం (మ.2015).
2వ తేదీ నుండి కాణిపాకం బ్రహ్మోత్సవాలు
Related tags :