చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాందించుకున్న నటి కీర్తీసురేశ్. మాలీవుడ్లో రంగప్రవేశం చేసినా, కోలీవుడ్, టాలీవుడ్లోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. తమిళంలో తొలి చిత్రం ఇదు ఎన్న మాయం చిత్రం ఆశించిన విజయాన్ని అందించకపోయినా, ఆ తరువాత రజనీమురుగన్, రెమో చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. దీంతో విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకున్న కీర్తీసురేశ్ తన తల్లి కోరికను తీర్చేసింది. ఆమె తల్లి మేనక చాలా కాలం క్రితం రజనీకాంత్కు జంటగా నెట్రికన్ను చిత్రంలో నటించింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోలేకపోయింది. అలా తన తల్లి సాధించలేనిది కీర్తీసురేశ్ సాధించిందనే చెప్పాలి. ఇక తెలుగులో నేను శైలజా వంటి కొన్ని హిట్ చిత్రాల్లో నటించినా మహానటి చిత్రం నటిగా కీర్తీసురేశ్ స్థాయిని ఒక్క సారిగా పెంచేసింది.
కోలీవుడ్ కనికరించలేదు
Related tags :