NRI-NRT

తానా ఫౌండేషన్‌కు నూతన కార్యవర్గం

TANA Foundation Gets New Leadership For 2019-21-niranjan srungavarapu-ravi mandalapu-tana foundation new executive committee results.

తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా శృంగవరపు నిరంజన్‌ వరుసగా ఎన్నికయ్యారు. ఆయన మరో రెండేళ్లు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కార్యదర్శిగా ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన రవి మందలపు ఎన్నికయ్యారు. కోశాధికారిగా శశికాంత్ వల్లేపల్లి ఎన్నికయ్యారు. రాబోయే రెండేళ్లలో ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల్లో విద్య, ఆరోగ్య రంగంలో ఉత్తమ సేవలందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా నిరంజన్‌ వెల్లడించారు. అమెరికాలోని ప్రవాసాంధ్రుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), తెలుగు రాష్ర్టాల్లోని సామాన్యులకు కూడా తానా ఫౌండేషన్‌ పేరిట ప్రత్యేక సేవలందిస్తోంది.