DailyDose

నేటి అసెంబ్లీలో మాటల యుద్ధం–TNI కధనాలు

Today Andhra Assembly Updates & News Stories

* ఏపీ శాసనమండలి నుంచి తెదేపా వాకౌట్‌
ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే మండలి నుంచి తెదేపా సభ్యులు వాకౌట్‌ చేశారు. కరవుపై చర్చ జరపాలని మండలిలో తెదేపా నేతలు పట్టుబట్టారు. రాష్ట్రంలో కరవును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. కాగా ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదంటూ మండలి నుంచి తెదేపా నేతలు బయటకు వెళ్లిపోయారు. తమ ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానం చెప్పలేదని, కరవు విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ విమర్శించారు.
* సీఎం జ‌గ‌న్ వ‌ర్సెస్ కేంద్రం: వ‌యన వ‌హారం ముదురుతోంది: కేంద్ర సంస్థ‌ల స‌హాయ నిరాక‌ర‌ణ‌..!
క్ర‌మంగా కేంద్రం..ఏపీ ప్ర‌భుత్వం మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది. పీపీఏల విష‌యంలో కేంద్రం వ‌ద్ద‌ని చెప్ప‌టం..
ఏపీ సీఎం గ‌న్ స‌మీక్ష విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌క‌పోవ‌టంతో ఈ వ్య‌వ‌హారం ముదురుతోంది. దీంతో..శాస‌న‌స‌భా వేదిక‌గా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో ఏం జ‌రిగింద‌నే దాని పైన ముఖ్య‌మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు. అదే స‌మ‌యంలో విద్యుత్ ఒప్పం దాల పైన రాష్ట్ర ప్ర‌భుత్వం ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. అయితే, ఈ స‌మీక్ష‌కు కేంద్ర విద్యుత్ సంస్థ‌లు హాజరు కాకూడ‌ద‌న నిర్ణ‌యించాయి. కానీ, ఏపీ సీఎం జ‌గ‌న్ మాత్రం ఈ విష‌యం పైన వెన‌కడుగు లేద‌ని చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఏ ట‌ర్న్ తీసుకుంటుందోన‌నే ఉత్కంఠ మొద‌లైంది.
* ఏపీ శాసనమండలి నుంచి తెదేపా వాకౌట్‌ …
ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ, శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే మండలి నుంచి తెదేపా సభ్యులు వాకౌట్‌ చేశారు. కరవుపై చర్చ జరపాలని మండలిలో తెదేపా నేతలు పట్టుబట్టారు. రాష్ట్రంలో కరవును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. కాగా ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదంటూ మండలి నుంచి తెదేపా నేతలు బయటకు వెళ్లిపోయారు. తమ ప్రశ్నలకు మంత్రి బొత్స సమాధానం చెప్పలేదని, కరవు విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ విమర్శించారు.
* ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వాకౌట్
వాకౌట్‌తో అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులు ఒకింత కంగుతిన్నారు. అధికార పార్టీకి చెందిన.. పైగా మంత్రి వాకౌట్ చేయడంతో రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటి వరకూ అధికార పార్టీకి చెందిన సభ్యులుగానీ.. మంత్రులుగానీ వాకౌట్ చేసిన సందర్భాలు చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు.సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగానే.. కరువు, అనావృష్టిపై శాసనమండలిలో చర్చ జరిగింది.ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు బొత్స స్పందించారు. కరువుపై అన్ని జిల్లాల నుంచి సమగ్ర నివేదికలను తెప్పిస్తున్నామని.. త్వరలోనే ఈ లెక్కలు తేలుతాయని మంత్రి చెప్పుకొచ్చారు.
* ఫైబర్‌ గ్రిడ్‌ మాయ.. బ్లాక్‌లిస్ట్‌లోని వేమూరికి కాంట్రాక్ట్రా!?
ఏపీ ఫైబర్ గ్రిడ్ ఒక మాయ అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రూ.149 రూపాయలకే కనెక్షన్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఎక్కువ వసూలు చేసిందని ప్రశ్నించారు. ఫైబర్ గ్రిడ్‌పై అనేక ఆరోపణలున్నాయని, విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫైబర్ గ్రిడ్‌ను చేపట్టిన వేమూరి హరికృష్ణ ప్రసాద్‌పై ఈవీఏం ట్యాంపరింగ్ కేసు ఉందని, అతను బ్లాక్‌లిస్ట్‌లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్‌ను అతనికి ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు.ఈ పథకం కింద నాసిరకం సెటప్‌ బాక్స్‌లు సరఫరా చేశారన్న ఆరోపణలున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలన్నింటిపైనా ఎంక్వైరీ చేసి విచారణ జరపాలని కోరారు. దీనికి ఐటీ మంత్రి గౌతంరెడ్డి సమాధానమిస్తూ.. ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై అనేక ఆరోపణలున్నాయని,బెంగుళూరులో రూ.1200కు ఇస్తున్న సెటప్ బాక్స్‌లను ఏపీలో రూ. నాలుగువేలకు ఇస్తున్నారని పేర్కొన్నారు. టెండర్ సమయంలో సెంటర్ విజిలెన్స్ గైడ్‌లైన్స్ కూడా పాటించలేదని తెలిపారు. ఏపీ ఫైబర్ గ్రిడ్‌పై జరిగిన అవకతవకలపై కేబినెట్ సబ్ కమిటీ విచారణ జరుపుతోందని, ఈవిచారణలో అన్ని నిజాలు బయటపడతాయన్నారు.
* ప్రపంచ బ్యాంకు నిధులపై బుగ్గన కీలక ప్రకటన
ప్రపంచ బ్యాంకు నిధులపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అసత్యాలు మాట్లాడుతున్నారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు. బడ్జెట్‌పై చర్చలో భాగంగా ప్రపంచ బ్యాంక్‌ నిధులపై సోమవారం మంత్రి వివరణ ఇచ్చారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్‌ సిద్ధంగా ఉందని, రూ. 5వేల కోట్లు సాయమందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజలకు, ప్రతిపక్షాలకు వివరణ ఇచ్చేందుకు అసెంబ్లీలో ఆయన కీలక ప్రకటన చేశారు. 2017, 2018లో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో పర్యటించారని, వారికి ఇక్కడి రైతులు, ఎన్జీవోలు అమరావతి అవినీతిపై ఫిర్యాదు చేశారని వెల్లడించారు. ఆ తరువాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఇచ్చిన నివేదికపై టీడీపీ ప్రభుత్వం స్పందించలేదని, అందుకే రూ. 3500 కోట్ల రుణాన్ని నిలిపివేశారని వివరించారు. అయితే తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకానికి ఆర్థిక సహాయం చేసేందుకు ప్రపంచ బ్యాంకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
* శాసనసభ లో రేషన్ డీలర్ల అంశం పై చర్చ-మంత్రి కొడాలి నాని
రాష్ట్రంలో 30 వేళా మంది రేషన్ డీలర్లు ఉన్నారుప్రభుత్వం రేషన్ డీలర్లను తొలగించాలని ప్రతిపాదన లేదుటీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి రేషన్ డీలర్లను తొలిగిస్తున్నారని ప్రచారం చేస్తున్నారురేషన్ డీలర్లను స్టాక్కిస్ట్ గా మారుస్తాంగతంలో నా నియోజకవర్గంలో నే 42 మంది డీలర్లను తొలగించి టీడీపీ అనుచరులను పెట్టారుటీడీపీ నేతలు డీలర్లను నుండి డబ్బులు వసూలు చేశారుఒరిజినల్ రేషన్ డీలర్లు ఎవర్ని తొలగించం..దొంగ దారుల్లో వచ్చిన వారు లేచిపోతారుగతం ప్రభుత్వం హయం లో రేషన్ డీలర్ల పై కేసులు పెట్టారుముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపాధి కల్పిస్తారు తప్ప తొలగించరు
* ఆంధ్రప్రదేశ్ శాసనమండలి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వాకౌట్
వాకౌట్‌తో అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులు ఒకింత కంగుతిన్నారు. అధికార పార్టీకి చెందిన.. పైగా మంత్రి వాకౌట్ చేయడంతో రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పటి వరకూ అధికార పార్టీకి చెందిన సభ్యులుగానీ.. మంత్రులుగానీ వాకౌట్ చేసిన సందర్భాలు చాలా తక్కువేనని చెప్పుకోవచ్చు.సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగానే.. కరువు, అనావృష్టిపై శాసనమండలిలో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు బొత్స స్పందించారు. కరువుపై అన్ని జిల్లాల నుంచి సమగ్ర నివేదికలను తెప్పిస్తున్నామని.. త్వరలోనే ఈ లెక్కలు తేలుతాయని మంత్రి చెప్పుకొచ్చారు. చర్చ జరుగుతుండగానే వాకౌట్!!రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదు అయిందన్నారు. ఆత్మహత్యలు ఎవరు చేసుకున్నారు..? ఎటువంటి పరిస్థితుల్లో చేసుకున్నారు..? అనే దానిపై నివేదిక తయారు చేస్తున్నామని మంత్రి చెప్పుకొచ్చారు. సంవత్సరాల్లో గత ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మంత్రి విమర్శలు గుప్పించారు.
అయితే చర్చ జరుగుతున్న సమయంలోనే సభ నుంచి మంత్రి వెళ్ళిపోయారు. మరోవైపు.. ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి వెళ్లిపోవడంపై టీడీపీ శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేశారుచర్చపై సరైన సమాధానం రాకపోవడం, మంత్రి బొత్స మండలి నుంచి వెళ్లిపోవడంతో టీడీపీ శాసనమండలి సభ్యులు కూడా సభ నుంచి బయటికి వెళ్లిపోయారు అయితే ఈ వాకౌట్ వ్యవహారంపై బొత్స ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.కాగా.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తన సోదరుడు హఠాన్మరణం చెందడంతో ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరుకాలేకపోయారు. అంతేకాదు.. కురసాలకు బదులుగా మంత్రి బొత్సా సత్యనారాయణే వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇవాళ కరువుపై చర్చ జరుగుతుండగా.. మంత్రి వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది.