* వ్యాపార దిగ్గజ సోదరులుగా ఘనతకెక్కిన ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాల మనుగడ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. ముకేష్ అంబానీ కంపెనీల బ్రాండ్ విలువ పెరుగుతూ పోతుంటే మరోపక్క అనిల్ అంబానీ కంపెనీల బ్రాండ్ విలువ రోజు రోజుకు తరుగుతూ వస్తోంది. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయెన్స్ గ్రూప్ బ్రాండ్ విలువ గతేడాది కన్నా ఈ ఏడాది మరింత పడిపోయింది. ఇప్పుడు ఈ బ్రాండ్ విలువ 65 శాతం తగ్గి 3, 848 రూపాయలకు పడిపోయింది. దాంతో అనిల్ అంబానీ కంపెనీల గ్రూప్ బాండ్ భారత్‌లో 56వ స్థానానికి చేరుకుంది. 2018లో ఉన్న స్థానంతో పోలిస్తే ఏకంగా 28 ర్యాంకులు తగ్గింది.
* టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో త్వరలోనే బ్రాడ్ బ్యాండ్ సేవలను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సేవలు అనేక నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. మరిన్ని నగరాలకు త్వరలోనే విస్తరించనుంది. వ్యాపార వర్గాల తాజా సమాచారం ప్రకారం ఆగస్టు 12వ తేదీ నుంచి రిలయన్స్ జియో బ్రాడ్ బ్యాండ్ సేవలను అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి ప్రకటనా వెలువడ లేదు.
* త్త బైక్ కొనుక్కోవాలనుకునేవారికి శుభవార్త. ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో తాజాగా కొత్త బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని పేరు సీటీ 110. ఇక ధర విషయానికి వస్తే (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) రూ.37,997 నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. అవి కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్. కిక్ స్టార్ట్ ధర వచ్చి కూ.37,997గా, ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.44,480గా ఉంది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ కొత్త బైక్‌ను లాంచ్ చేశామని బజాజ్ ఆటో మోటార్ సైకిల్ బిజినెస్ ప్రెసిడెంట్ సారంగ్ కనడే తెలిపారు. టెక్నాలజీ, స్టైల్ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. మైలేజ్, పవర్, తక్కువ ధర, మన్నిక వంటి అంశాలు అన్నీ ఉన్నాయని తెలిపారు. ఇక ఈ బైక్‌లో ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు చూస్తే.. సెమీ నాబీ టైర్స్, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, బిగ్గర్ క్రాష్ గార్డ్, అప్‌స్వెప్ట్ ఎక్స్‌హాస్ట్, రబ్బర్ మిర్రర్ కవర్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. కంపెనీ ఇందులో 115 సీసీ డీటీఎస్-ఐ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ అమర్చింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ రూ.1,932 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఎరువులు, పంట రక్షణ ఉత్పత్తులు అందించే సంస్థ అయిన కోరమాండల్ ఇంటర్నేషనల్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి నిరుత్సాహకరమైన ఫలితాలను ప్రకటించింది.
*ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో టీవీఎస్ మోటార్ రూ.151.24 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
*బజాజ్ ఆటో ప్రారంభ స్థాయి మోటార్సైకిల్ మోడల్ సీటీ 110లో కొత్త వెర్షన్ను విపణిలోకి విడుదల చేసింది. దీని ధరల శ్రేణి రూ.37,997- 44,480 (ఎక్స్- షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు.
*టాటా అనుబంధ సంస్థ ర్యాలీస్ ఇండియా లిమిటెడ్ నూతనంగా రెండు రకాల వరి కీటక నాశన మందులను మార్కెట్లోకి విడుదల చేసింది. దేశంలోనే మొదటిసారిగా జైగంట్ 0.7 శాతం, అయాన్ 48 శాతం శిలీంద్ర నాశన పురుగుల మందులను విజయవాడ నోవాటెల్ హోటల్లో సోమవారం కంపెనీ సీఈవో సంజీవ్ లాల్ విడుదల చేశారు.
* మొబైల్ఫోన్ల కంపెనీ షియోమీ చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని ఎలక్ట్రానిక్ పార్క్లో మరో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే నెల్లూరు శ్రీసిటీలో ఓ యూనిట్ ఉండగా, మరొకటి రేణిగుంట వద్ద ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
*గేమ్ రిజర్వ్, రెండు సూపర్యాచ్లు, విలువ కట్టలేని వింటేజ్ కార్లు, విలువైన చిత్రాలు, సుప్రసిద్ధ ఎల్టన్ జాన్ వినియోగించిన పియానో.. వంటి అత్యంత ఖరీదైన ఆస్తులు విజయ్ మాల్యా ఆధీనంలో ఉన్నాయి.
అంబానీ కంపెనీ పతనం-వాణిజ్య-07/23
Related tags :