*2014లో కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీలో జరిగిన దాడి ఘటనపై కర్నూలు జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. మున్సిపాలిటీలో దాడి ఘటనకు సంబంధించి దివంగత మాజీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అనుచరులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. భూమా నాగిరెడ్డి అనుచరులైన 13 మందికి రెండేళ్లపాటు జైలు శిక్ష విధిస్తూ కర్నూలు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. ఇకపోతే నవంబర్ 1 2014న నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం కౌన్సిలర్లు, వైసీపీ కౌన్సిలర్ల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఘర్షణలో పలువురు గాయపడ్డారు. ఈ దాడులలో తెలుగుదేశం పార్టీకి చెందిన కౌన్సిలర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డిపైనా, ఆయన అనుచరులపైనా కేసులు నమోదు అయ్యాయి. భూమా నాగిరెడ్డిపై రెండు హత్యాయత్నం కేసులతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా ఆయన అనుచరులుపై కూడా హత్యాయత్నం, దాడి కేసులు నమోదు అయ్యాయి. ఆనాడు భూమా నాగిరెడ్డి అజ్ఞాతంలోకి కూడా వెళ్లారు. తన గన్ మెన్లను సైతం వదిలేసి అరెస్ట్ చేస్తారన్న ఆందోళనతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం గుండెపోటుతో హఠాన్మరణం చెందడం జరిగిపోయాయి. ఇకపోతే ఆయన కుమార్తె భూమా అఖిలప్రియ తెలుగుదేశం ప్రభుత్వంలో రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారు. భూమా నాగిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నమోదైన కేసులో ఇప్పుడు తీర్పు వెలువడటం చర్చనీయాంశంగా మారింది. అయితే శిక్ష పడ్డ వారంతా ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్న నేపథ్యంలో తీర్పుపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.
* హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఓ బ్యుటీషియన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
* తరచూ నలుగురిలో మందలిస్తున్నాడని ఆగ్రహానికి గురైన ఓ యువకుడు.. ఉపాధ్యాయుడిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలులో కలకలం రేపింది. వీరవెంకట సత్యనారాయణ అనే ఉపాధ్యాయుడు తరచూ మందలిస్తున్నాడని విన్సెంట్ అనే యువకుడు దాడికి దిగాడు. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు. ప్రస్తుతం బాధిత ఉపాధ్యాయుడు అమలాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
* టీడీపీ కార్యకర్తలపై వైపీపీ వర్గీయుల దాడులు ఆగడంలేదు. తాజాగా గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తుబాడు గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వర్గీయులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగాయపడిన వ్యక్తికి నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
*వంపేట మండలం శంకర్‌తండాలో ఇవాళ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పూరిల్లులో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దీంతో పూరిల్లు పూర్తిగా కాలిపోగా, నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
*ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. తండ్రిని కుమారుడు ప్రశాంత్ హత్య చేశాడు. 4 నెలల క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్లిన ప్రశాంత్ తండ్రి.. ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ఇంటికొచ్చిన తర్వాత ఇరుగుపొరుగు వారిని ఇబ్బంది పెడుతున్నాడు. తండ్రి ప్రవర్తన నచ్చని కుమారుడు.. ఆయనను హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట ప్రశాంత్ లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
*ప్రకాశం జిల్లాచీరాల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షలతో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. జయంతి పేటకు చెందిన కోటి సన్నీడియో అనే యువకుడిపై అదే ప్రాంతానికి చెందిన గోశాల అభిలాష్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు అభిలాష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
*టి.నర్సాపురం మండలంలోని మధ్యాహ్నపువారి గూడెంలో అక్రమంగా నిల్వచేసిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గుడిమెల్లంక వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ గోదావరి కాల్వలోకి ద్విచక్రవాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఓ మహిళ మృతి చెందారు.
*చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలో రూ.2 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను కుప్పం సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*బంధువుగా తండ్రి ద్వారా పరిచయమైన వ్యక్తి తనను కొట్టి, సిగరెట్లతో కాల్చి భయపెట్టి అత్యాచారం చేశాడంటూ బాలిక సోమవారం ‘స్పందన’లో అర్బన్ ఏఎస్పీ వైటీ నాయుడుకు ఫిర్యాదు చేసింది.
*అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట పంచాయతీలోని గిర్రాజుకాలనీ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల ఆవరణలో పాముకాటుకు గురైన విద్యార్థి పవన్(7) కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ సోమవారం మృతిచెందాడు.
*వృద్ధ దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా దర్శిలో సోమవారం చోటుచేసుకుంది.
*అమరావతిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లిఫ్టు కింద జారి పడిన ఘటనలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టరు వద్ద పని చేస్తున్న సాంకేతిక సిబ్బంది ముగ్గురు చనిపోయారు.
*తన భూమి సమస్యను పరిష్కరించకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ..సోమవారం మాజీ మావోయిస్టు కాశీరాం ఆత్మహత్యకు యత్నించారు.
*వాణిజ్య రాజధాని శివారులో గుర్తుతెలియని దుండగులు విక్కీ శ్రీనివాస్ గంజి (33) అనే వ్యక్తిని కాల్చి చంపారు. ఒషివారా సమీపంలోని నర్మదా భవనం మూడో అంతస్తులో సోమవారం రాత్రి ఆయన బుల్లెట్ల గాయాలతో అచేతనంగా ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. జుహూలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే శ్రీనివాస్ మృతిచెందాడని వైద్యులు ధ్రువీకరించారు.
*బాంద్రా ప్రాంతంలో 9 అంతస్తులలో ఉన్న టెలిఫోన్ ఎక్స్ఛేంజి భవనంలో మంటలు చెలరేగడంతో ముంబయివాసులు ఉలిక్కిపడ్డారు.
*కన్న పిల్లల్ని కిరాతకంగా హత్య చేసి జైలు పాలైన మహిళ జైలులోనే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి (కంది) జిల్లా జైలులో సోమవారం జరిగింది.
*భర్తను కోల్పోయి వృద్ధాప్యంలో ఒంటరిగా జీవిస్తున్న తల్లి ఆస్తిని స్వాహా చేసిన కొడుకు, కోడలికి మల్కాజిగిరి కోర్టు సోమవారం రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
*దేశ రాజధాని దిల్లీతో పాటు మరో మూడు రాష్ట్రాల్లోని 11 వేర్వేరు ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సోమవారం సోదాలు చేపట్టింది.
*వారిద్దరికి నాలుగేళ్ల కిందట ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల తరువాత వారి పరిచయం కాస్త ప్రేమ వివాహానికి దారితీసింది. కొన్నేళ్ల తరువాత పరస్పర ఆరోపణలు చేసుకుంటూ ఘర్షణలకు పాల్పడ్డారు.
*నేషనల్ హైవే 65పై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకు పాముల వద్ద ఎన్హెచ్ 65పై విజయవాడ నుంచి హైదరాబాదు వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది.
*మహారాష్ట్రలోని బీవాండి నగరంలో ఉన్న కెమికల్ గోదాంలో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది.
* రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ప్రసారాలను నిలిపివేసేంత వరకు తన పోరాటం ఆగదని జర్నలిస్టు శ్వేతా రెడ్డి అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నటి, యాంకర్ గాయిత్రి గుప్తా, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా తరహాలో బిగ్‌బాస్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని ఆరోపించారు. మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా షోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తాను చేస్తున్న పోరాటానికి ఇప్పటికే పలు సంఘాల మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు కూడా తన పోరాటానికి మద్దతు తెలిపారన్నారు.సినిమా రంగంలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం సరికాదన్నారు. తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టి మార్పులు తీసుకువస్తానని ప్రకటించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా తమిళ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24, 25 తేదీల్లో తమిళనాడుకు వస్తున్నారని, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త రాజేశ్వరి ప్రియతో ప్రధానిని కలిసి ‘బిగ్‌బాస్’పై వినతిపత్రం సమర్పిస్తామని శ్వేతా రెడ్డి తెలిపారు. ‘బిగ్‌బాస్’ను నిలిపివేయాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైకోర్టును ఆశ్రయించామని, దీనిపై ఈ నెల 29న విచారణ జరుగుతుందని వెల్లడించారు.
భూమా వర్గీయులకు జైలు శిక్ష-నేరవార్తలు–07/23
Related tags :