ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ నిరాకరించి వారం రోజులు గడవక ముందే ఏపీ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి ప్రాజెక్టుకు 200 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేది లేదని ఇవాళ(జులై-23,2019)చైనా ఆధిపత్యంలోని ది ఏషియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(AIIB)తేల్చి చెప్పింది. ఓ న్యూస్ ఏజెన్సీకి పంపిన ఈ మెయిల్ లో AIIB ప్రతినిధి ఈ విషయాన్ని తెలిపారు.ఏపీ రాజధాని అమరావతికి నిర్మాణం, అభివృద్ధికి అందించనున్న రుణ సహాయాన్ని తాము నిలిపివేస్తున్నట్టుగా ఐదు రోజుల క్రితం వరల్డ్ బ్యాంక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమరావతి డెవలప్‌మెంట్‌కి సంబంధించిన రుణ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకోవడం వల్లే తాము వెనక్కి తగ్గినట్టుగా ప్రపంచబ్యాంక్ తెలిపింది.
ఏపీకి ఋణాన్ని ఆపేసిన మరో ఆసియా బ్యాంకు
Related tags :