ముందుగా జుట్టుని చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తరువాత రబ్బరుబ్యాండు పెట్టుకుని పోనీ టెయిల్‌లా వేసుకోవాలి. ఆపై సన్నటి పాయలు తీసుకుని రెండు జడలు అల్లుకోవాలి. ఇప్పుడు వాటి పక్కనుంచి మరో రెండు సన్నటి పాయలు తీసుకుని జడ మధ్యలోకి తీసుకురావాలి. తరువాత ఆపాయల్ని రెండో జడ మధ్యలో నుంచి హెయిర్‌టూల్ సాయంతో ఇవతలకు తీయాలి. ఇలా మరో వైపూ చేస్తూ చివరి వరకూ అల్లుకుంటూ వెళ్లాలి. దాంతో జడ అంతా తీగలా అల్లుకున్నట్లు కనిపిస్తుంది.
తీగల జడ అల్లుకోవడం తెలుసా?
Related tags :