36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక సెంట్రిక్ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వివాహానంతరం నటిగా రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక మగళీర్ మట్టుం, కాట్రిన్ మొళి చిత్రాలతో అలరించింది. తాజాగా జ్యోతిక నటిస్తున్న చిత్రం జాక్‌పాట్ . గులేభకావళి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జ్యోతిక భర్త, నటుడు సూర్య తన 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇందులో నటి రేవతి ముఖ్య పాత్రలో నటిస్తుండటం విశేషం. పోలీస్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, మొట్ట రాజేంద్రన్, ఆనంద్‌రాజ్, మన్సూర్‌అలీఖాన్, జగన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఆనందకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. జాక్‌పాట్ చిత్రం ఆగస్ట్ 2న విడుదల కానుంది. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో కామెడీ సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్స్‌గా జ్యోతిక, రేవతి అలరించారు. జ్యోతిక తన మరిది కార్తీతో ప్రస్తుతం ఓ చిత్రం చేస్తుంది. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక తన భర్త సూర్య సొంత నిర్మాణ సంస్థలో మరో సినిమా ఓకే చేసింది జ్యోతిక . 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలో ‘పొన్‌మగల్ వందాల్’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. సీనియర్ దర్శక నటులు భాగ్యరాజ్, పాండియరాజన్, పార్తిబన్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తుండటం విశేషం. ప్రతాప్ పోతన్ కీలకపాత్రలో కనిపించనున్నారు
Jyothika’s Jackpot Official Trailer Video
Related tags :