ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం వెంకీమామ చిత్రంలో వెంకటేష్ సరసన కథానాయికగా నటిస్తుంది. రవితేజ డిస్కోరాజా చిత్రంలోను ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే `RDX లవ్` అనే ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలోను నటిస్తుంది. ప్రస్తుతం తన కాల్షీట్స్ ఖాళీ లేకుండా చేసుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటోలతో పాటు సినిమాలకి సంబంధించిన పోస్టర్స్‌ని షేర్ చేస్తుంది. రీసెంట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఫొటోకు మూడు లవ్ సింబల్స్‌ని జత చేశారు. దాంతో నెటిజన్లు ప్రేమలో పడ్డావా పాయల్, అతను నీ ప్రియుడా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే పాయల్ స్పందించాల్సిందే.
పాయల్ దిల్ బాజే
Related tags :