తానా కార్యదర్శి పొట్లూరి రవి ఒక పేద విద్యార్థినికి విద్యాఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా కప్పట్రాల్ల గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న విద్యార్థిని షహీన్‌కు ఆయన ఇప్పటివరకు ₹85వేలను అందించారు. మొదటి సంవత్సరం ₹40వేలు, రెండో ఏడాది ₹45వేలను ఆయన ఇప్పటివరకు అందజేశారు. ఆమె ఉన్నత విద్యకు కూడా తనవంతు సాయం చేస్తానని రవి తెలిపారు.
పేద విద్యార్థినికి పొట్లూరి రవి ఆర్థిక సహాయం
Related tags :