* వచ్చే నవంబరులో ప్రవాస తెలంగాణ వాసులు భారీ సంఖ్యలో భాజపాలో చేరతారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం న్యూయార్క్లో తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన వారితో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. తెరాస ప్రభుత్వ ఒంటెత్తు పోకడలు, కుటుంబపాలన, నిధుల దుర్వినియోగం, నిరుద్యోగ సమస్యలను లక్ష్మణ్ వారికి వివరించారు. అనంతరం తెలంగాణ లక్ష్మణ్గా పేరున్న తెలంగాణ అభివృద్ధి ఫోరం(టీడీఎఫ్) మాజీ అధ్యక్షుడు (ఫార్మసిస్ట్) ఏనుగు లక్ష్మణ్ను పార్టీలోకి ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఆయన నవంబరు నెల ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలిసింది.
* కర్ణాటక రాజకీయంలో మరో మలుపు!
కర్ణాటక రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు రేపటికి వాయిదా వేసింది. కర్ణాటకలో ఇవాళ లేదా రేపు బలపరీక్ష పూర్తవుతుందని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. బల పరీక్షను వెంటనే జరపాలని స్వతంత్ర్య ఎమ్యెల్యేలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ ఇవాళ సాయంత్రం 6గంటల లోపు బలపరీక్ష నిర్వహించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. విశ్వాస పరీక్ష పేరిట రోజూ సభను వాయిదా వేస్తున్నారని వివరించారు. మరోవైపు విశ్వాస తీర్మానంపై ప్రస్తుతం సభలో చర్చ జరుగుతోందని స్పీకర్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. ఈరోజు బలపరీక్ష ముగిసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. చర్చ ముగియగానే పరీక్ష ఉంటుందని చెప్పారు. దీంతో స్పీకర్ తరఫు న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకొని విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను తక్షణమే విచారణకు స్వీకరించాలని సుప్రీంను స్వతంత్ర ఎమ్మెల్యేలు సోమవారం కోరగా.. వారి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఇక అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యాన్ని నిరసిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, విప్ అంశంపై కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య కూడా సుప్రీంను ఆశ్రయించారు. ఈ మూడు వ్యాజ్యాలపై సుప్రీం ఈరోజు విచారించే అవకాశం ఉందని భావించారు. కోర్టు తీర్పు ఆధారంగానే స్పీకర్ నిర్ణయం ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణను సుప్రీం రేపటికి వాయిదా వేయడంతో.. బలపరీక్ష ఏ దిశగా సాగుతుందనేది ఉత్కంఠగా మారింది.
*బ్రిటన్ తదుపరి ప్రధానిగా బోరిస్ జాన్సన్
బ్రిటన్ తదుపతి ప్రధానిగా బోరిన్ జాన్సన్(55) కానున్నారు. ప్రస్తుత ప్రధాని థెరిసా మే రాజీనామా చేయడంతో కన్జర్వేషన్ పార్టీ జాన్సన్‌ను ప్రదానిగా ప్రకటించింది. త్వరలోనే బ్రిటన్ ప్రధానిగా బోరిన్ జాన్సన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మాజీ జర్నలిస్ట్ అయిన జాన్సన్ ఫారెన్ సెక్రటరీగా, లండన్ నగర మేయర్‌గా, థెరిసా మే కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు
* విజయసాయిరెడ్డితో ఐఏఎస్ శ్రీలక్ష్మి భేటీ
దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డితో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి ఏపీకి తనను డిప్యుటేషన్‌పై పంపాలని కోరినట్టు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో క్యాడర్‌లో పనిచేస్తున్న శ్రీలక్ష్మి బదిలీ కోసం గతంలోనే దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఏపీలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్న తరుణంలో కేంద్రం నుంచి కొన్ని అడ్డంకులు ఎదురైనట్టు తెలుస్తోంది. ఏపీ క్యాడర్‌కు బదిలీ ప్రక్రియలో అడ్డంకులు ఎదురవడంతో మంగళవారం ఆమె విజయసాయిరెడ్డితో పాటు పార్లమెంట్ వద్దకు వెళ్లి కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, పీఎంవో అధికారులను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో సీఎం జగన్‌ను కూడా శ్రీలక్ష్మి కలిశారు.
* బీజేపీలోకి మాజీ ఎంపీ వివేక్..
మాజీ ఎంపీ వివేక్ బీజేపీలో చేరుతున్నారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరగుతోంది. మంగళవారం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో టచ్ లో ఉంటున్నారని… ఈరోజు అధికారికంగా ఆయన కమలం గూటికి చేరనున్నట్లు సమాచారం.బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలోనే వివేక్ కషాయ రంగు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇప్పటికే వివేక్ ఢిల్లీ చేరుకోగా… మరికాసేపట్లు బీజేపీలో చేరనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వివేక్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కరీంగనర్ ఎంపీ టికెట్ ఆశించారు. కాగా…. కేసీఆర్ ఆ టికెట్ వివేక్ కాకుండా మరొకరికి కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వివేక్… అప్పటి నుంచి పార్టీ కి దూరంగా ఉంటూ వచ్చారు. టీఆర్ఎస్ కి రాజీనామా కూడా చేసేశారు.
* ప్రజల కోసం ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా?: కళా
తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు మండిపడ్డారు. ప్రజల కోసం ప్రశ్నిస్తే సభ నుంచి సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. ముగ్గురు తెదేపా సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు తెదేపా రాష్ట్ర కార్యాలయంలో వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి కళా వెంకటరావు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జగన్ ఇచ్చిన మాట తప్పుతున్నారని.. మడమ తిప్పుతున్నారని వర్ల రామయ్య విమర్శించారు. అమ్మ ఒడి పథకాన్ని ఒకే పిల్లాడికి అమలుచేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ మాటమార్చడం దారుణమని ఆలపాటి అన్నారు.
* ప్రజారోగ్యం కోసం ప్రతీ ఏడాది రూ.6 వేల కోట్లు: ఈటల
హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆధ్వర్యంలో 18వ గ్లోబల్ హెల్త్ కేర్ సమ్మిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ.. ప్రతి తెలంగాణ పౌరుడు గొప్పగా చెప్పుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని.. తెలంగాణ రాష్ట్రం దాదాపు 17 రంగాల్లో గొప్ప స్థానంలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తోపాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
* పబ్లిక్ పార్కింగ్ సమస్యను ఎలా తీరుస్తారు: ఎంపీ ప్రభాకర్ రెడ్డి
మోటార్ వెహికిల్స్ సవరణ బిల్లుపై ఇవాళ లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. కొన్ని కంపెనీలు 15 ఏళ్ల నుంచి ఉన్నా.. వాటి స్పేర్ పార్ట్స్ ఇంకా అందుబాటులో ఉండడం లేదన్నారు. నకిలీ స్పేర్‌పార్ట్స్‌ను నియంత్రించాలన్నారు. పట్టణాల్లో పార్కింగ్ పెద్ద సమస్యగా మారిందన్నారు. పబ్లిక్ పార్కింగ్ కోసం ప్రత్యేకంగా చేపట్టే చర్యల గురించి చెప్పాలన్నారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీలో కఠిన నియమాలు పాటించాలని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ కృష్ణదేవరాయులు తెలిపారు. మోటార్ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. మోటార్ బిల్లు బాగుందని, కానీ రాష్ట్రాల హక్కులను అది కాలరాస్తోందని డీఎంకే, తృణమూల్ పార్టీలు ఆరోపించాయి.
* *తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చిన గవర్నర్
తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ నరసింహన్ షాకిచ్చారు. అసెంబ్లీ ఆమోదించిన కొత్త మున్సిపల్ బిల్లుకు గవర్నర్ బ్రేక్ వేశారు. బిల్లులో కొన్ని సవరణలు చేయాలని ఈ మేరకు గవర్నర్ సూచించారు. కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రానికి బిల్లు పంపాలని నిర్ణయించడమే కాకుండా దానిని రిజర్వ్‌లో ఉంచారు. అసెంబ్లీ ప్రొరోగ్ కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో… గవర్నర్ సూచించిన సవరణలతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.
*భాజపాలోకి మాజీ ఎంపీ వివేక్?
పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ కమలం గూటికి చేరనున్నట్లు తెలిసింది. భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షాతో మంగళవారం దిల్లీలో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. వివేక్ను భాజపా గూటికి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నేతలు కొంతకాలంగా సంప్రదింపులు జరుపుతున్నారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డిలతో ఆయన చేస్తున్న చర్చలు, తాజాగా ఓకొలిక్కి వచ్చినట్లు సమాచారం. వివేక్తో పాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కూడా కమలం గూటికే చేరతారా అన్నది ఆసక్తికరంగా మారింది.
*రాజకీయ కోణంలోనే కొత్త కార్పొరేషన్లు, వార్డుల పునర్విభజన
ప్రజల అవసరాలను గుర్తించకుండా రాజకీయ కోణంలోనే కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు, వార్డుల పునర్విభజన చేశారని మున్సిపల్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో టీపీసీసీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఆరోపించింది. ఓటమి భయంతోనే జనగణన, ఓటరు జాబితా, వార్డుల విభజన తప్పులు తడకగా చేపట్టారని విమర్శించింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమర్థంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
*పథకాలకు నిధుల్లేవు.. కొత్త భవనాలెందుకు?
రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఉండగా.. వాస్తు పేరుతో ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మాణానికి సిద్ధపడడం దారుణమని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో తెజస అధినేత కోదండరాం మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ, బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణాలకు నిధుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచిగానే ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మిస్తామని మొండిపట్టు పట్టడం సరికాదన్నారు.
*వైకాపా దుష్ప్రచారంతోనే ప్రపంచబ్యాంకు రుణం రద్దు
రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు రుణం ఇవ్వకపోవడానికి పూర్తి బాధ్యత వైకాపాదేనని, ఆ పార్టీ నాయకులు కొందరు రైతులతోనూ, స్వచ్ఛంద సంస్థలతోనూ చేయించిన తప్పుడు ఫిర్యాదుల వల్లే ఆ పరిస్థితి తలెత్తిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డే ఆ ఫిర్యాదులు చేయించారన్నారు. సోమవారం మంగళగిరి సమీపంలోని హ్యాపీరిసార్ట్స్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని ప్రాజెక్టుల్లో అవినీతి కారణంగానే బ్యాంకు వెనక్కు తగ్గిందంటూ వైకాపా నాయకులు తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రపంచబ్యాంకు గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ రాజధాని పనుల్లో అవినీతి జరిగిందని అనలేదని చెప్పారు.
*హాజీపూర్ బాధిత కుటుంబాలను ప్రియాంకకు కలిపిస్తా: వీహెచ్
సైకో శ్రీనివాస్రెడ్డి చేతిలో అత్యాచారం, హత్యకు గురైన హాజీపూర్ బాధిత కుటుంబాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కలిపిస్తానని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు తెలిపారు. ఇందుకోసం సమయం కేటాయించాలంటూ ప్రియాంకకు లేఖ రాశానని చెప్పారు. సోమవారం ఆయన గాంధీభవన్లో మాట్లాడుతూ.. అమాయకపు పిల్లలు సైకో చేతిలో దారుణ హత్యకు గురైతే బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మంత్రులు కానీ ఎవరూ ఇంత వరకు పరామర్శించలేదని మండిపడ్డారు.
*రాజకీయ కోణంలోనే కొత్త కార్పొరేషన్లు, వార్డుల పునర్విభజన
ప్రజల అవసరాలను గుర్తించకుండా రాజకీయ కోణంలోనే కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు, వార్డుల పునర్విభజన చేశారని మున్సిపల్ ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో టీపీసీసీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఆరోపించింది. ఓటమి భయంతోనే జనగణన, ఓటరు జాబితా, వార్డుల విభజన తప్పులు తడకగా చేపట్టారని విమర్శించింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమర్థంగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
*ఎన్హెచ్ఆర్సీకి కోరలు కల్పించాలి
జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు కోరలు కల్పించాలని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు సూచించారు. మానవ హక్కుల రక్షణ (సవరణ) బిల్లు-2019పై రాజ్యసభలో సోమవారం ఆయన మాట్లాడారు. మన ఎన్హెచ్ఆర్సీని కోరలు లేని పులిగా సుప్రీంకోర్టు వర్ణించిందని.. కమిషన్ సైతం తనను తాను అదేవిధంగా చెప్పుకొందని తెలిపారు. ఎన్హెచ్ఆర్సీ కేవలం సూచనలు చేసే సంస్థగా మిగిలిపోయిందని, ఆ సూచనలను సైతం పోలీసులు పరిగణించడంలేదని పేర్కొన్నారు.
*పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్న ప్రభుత్వాలు
పెట్టుబడిదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊడిగం చేస్తున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. నల్గొండలో సోమవారం నిర్వహించిన సీపీఎం ప్రాంతీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో వెనకబడిన ప్రాంతాలను, పేద, మధ్య తరగతి వర్గాలు, రైతాంగాన్ని విస్మరించారని ఎద్దేవా చేశారు. కేంద్రం విద్యారంగాన్ని కాషాయీకరణ చేయడానికే కొత్త విద్యావిధానం ముసాయిదా తయారు చేసిందని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు.
*సమావేశాల పొడిగింపు వద్దు: విపక్షాలు
పార్లమెంటు సమావేశాలను పొడిగించాలన్న ప్రతిపాదనకు తాము సుముఖంగాలేమని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. సోమవారం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన సభా వ్యవహారాల సంప్రదింపుల కమిటీ భేటీలో ఈ విషయాన్ని చెప్పాయి. ముఖ్యమైన బిల్లుల ఆమోదం కోసం సమావేశాలను పొడిగించాలని భావిస్తున్నట్టు మంత్రులు చెప్పారు. సమావేశాలు ఈ నెల 26న ముగియనుండగా, మరో మూడు రోజులపాటు పొడిగిస్తూ స్పీకర్ మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశముంది.
*తెరాస, భాజపా అదే నిర్ణయం తీసుకోవాలి
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు ఇస్తామని కాంగ్రెస్పార్టీ ప్రకటించిన నేపథ్యంలో తెరాస, భాజపా కూడా అదే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర బీసీ ఫ్రంట్ ఛైర్మన్ మల్లేశ్యాదవ్ అధ్యక్షతన బషీర్బాగ్లో సోమవారం జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
*భాజపా ఆహ్వానం అందింది: రాయపాటి
భాజపాలోకి తనను ఆహ్వానించారని, దిల్లీ వెళ్లి అధిష్ఠానంతో మాట్లాడిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటానని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్న ఆయన ఆలయం ఎదుట విలేకరులతో మాట్లాడారు. ప్రొటోకాల్ పరిధిలోని వారికి కూడా హారతి ఇవ్వడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
*ఆర్థిక మంత్రే అవాస్తవాలు మాట్లాడతారా?
అమరావతి నిర్మాణానికి రుణం ఇవ్వకుండా ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గిన వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య శాసనసభలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటలు తూటాలై పేలాయి.
చంద్రబాబు మాట్లాడుతూ ‘‘ప్రపంచబ్యాంకు రుణంపై ఆర్థిక మంత్రి సభలో చేసిన ప్రకటన చాలా బాధాకరం. మేమెంతో కృషి చేసి రాష్ట్రంలో ఆరోగ్య సదుపాయాల మెరుగుదలకు ప్రపంచబ్యాంకు ప్రాజెక్టును తెచ్చాం. 2019 మే 15న దీన్ని వారు ఆమోదించారు.
*నా రాజీనామా ఆమోదించండి
తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్ను కోరారు. తన బదులుగా పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు వేణుగోపాల్ను సోమవారం బెంగళూరులో కలిసి విజ్ఞప్తి చేశారు.
*గత ప్రభుత్వవైఖరి వల్లనే… ప్రపంచబ్యాంకు వెనకడుగు
గత ప్రభుత్వ నిర్వాకం వల్లనే అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేసే విషయంలో ప్రపంచ బ్యాంకు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ప్రాజెక్టు ప్రతిపాదనను ఆమోదించటంలో గత ప్రభుత్వం చేసిన జాప్యం కూడా ఒక కారణమని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ)కి ఇచ్చే రుణాన్ని ప్రపంచ బ్యాంకు ఉపసంహరించుకున్న నేపథ్యంలో శాసనసభలో సోమవారం ప్రకటన చేశారు.
*మానవ హక్కుల కమిషన్లకు న్యాయాధికారాలు కల్పించాలి: కనకమేడల
కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని మానవ హక్కుల కమిషన్లకు న్యాయాధికారాలు లేదా పాక్షికమైన న్యాయాధికారాలు కల్పించాలని తెదేపా రాజ్యసభ పక్ష నేత కనకమేడల రవీంద్రకుమార్ కోరారు. మానవ హక్కుల రక్షణ (సవరణ) బిల్లు-2019పై రాజ్యసభలో సోమవారం ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని మానవ హక్కుల కమిషన్లకు ఎలాంటి అధికారాలు లేకపోవడంతో అవి ప్రభావశూన్యంగా మారాయని అన్నారు. ప్రస్తుత బిల్లులో కమిషనర్ల పదవీ కాలాన్ని అయిదేళ్లనుంచి మూడేళ్లకు తగ్గించారని, మళ్లీ వారినే నియమించే అవకాశం కల్పించారని, ఇది పూర్తి వైరుధ్యంగా ఉందని పేర్కొన్నారు.
*వైకాపా పాలనలో నిత్యకృత్యంగా రైతుల ఆత్మహత్యలు: తులసిరెడ్డి
వైకాపా పాలనలో రైతుల ఆత్మహత్యలు నిత్యకృత్యమయ్యాయని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్.తులసిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత 50 రోజుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 39 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అనధికారికంగా దీనికి 10 రెట్ల రైతులు చనిపోయారని పేర్కొన్నారు.
*మానవ హక్కుల కమిషన్లకు న్యాయాధికారాలు కల్పించాలి: కనకమేడల
కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని మానవ హక్కుల కమిషన్లకు న్యాయాధికారాలు లేదా పాక్షికమైన న్యాయాధికారాలు కల్పించాలని తెదేపా రాజ్యసభ పక్ష నేత కనకమేడల రవీంద్రకుమార్ కోరారు. మానవ హక్కుల రక్షణ (సవరణ) బిల్లు-2019పై రాజ్యసభలో సోమవారం ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని మానవ హక్కుల కమిషన్లకు ఎలాంటి అధికారాలు లేకపోవడంతో అవి ప్రభావశూన్యంగా మారాయని అన్నారు. ప్రస్తుత బిల్లులో కమిషనర్ల పదవీ కాలాన్ని అయిదేళ్లనుంచి మూడేళ్లకు తగ్గించారని, మళ్లీ వారినే నియమించే అవకాశం కల్పించారని, ఇది పూర్తి వైరుధ్యంగా ఉందని పేర్కొన్నారు.
*మూడు నెలల్లో తెలుగు నేర్చుకుంటా
ఏపీ గవర్నర్గా బాధ్యతలు చేపట్టాక రెండు, మూడు నెలల్లోనే తెలుగు నేర్చుకుంటానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. కటక్కు చెందిన ఐక్యత స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సోమవారం ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్లోని ఆయన నివాసానికి వెళ్లి కండువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ 24న తాను బాధ్యతలు చేపడతానన్నారు. అంతకు ముందు తిరుపతిలోని వేంకటేశ్వరుడు, విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకుంటానని ఆయన చెప్పారు. గవర్నర్ను కలిసి అభినందనలు తెలిపిన వారిలో ఐక్యత ప్రతినిధులు జి.కైలాష్రావు, జి.సూర్యారావు, రామలింగేశ్వర రావు, వేణుగోపాల్, ఎ.ఉమేష్కుమార్, వై.అప్పారావు తదితరులు ఉన్నారు.
భాజపాలోకి భారీగా ప్రవాస తెలుగువారు-రాజకీయ–07/23
Related tags :