ప్రవాసాంధ్ర ప్రముఖుడు, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ మరోసారి కీలక పదవికి రేసులో ఉన్నారు. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుకు, ప్రముఖ నటుడు బాలకృష్ణకు సన్నిహితుడైన మోహనకృష్ణ గత ఎన్నికలకు ముందు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తెలుగుదేశం అభ్యర్ధిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నికలకు సంవత్సరం ముందు నుండి గుంటూరులోనే మకాం వేసి స్థానిక తెలుగుదేశం రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. కులాలు, వర్గాలు సమీకరణలో గుంటూరు పశ్చిమ స్థానాన్ని చంద్రబాబు చివరి నిముషంలో మద్దల గిరిధర్(రాజా)కు కేటాయించారు. రాష్ట్రం మొత్తం వైకాపా ప్రబంజనం వెల్లివిరిసినప్పటికీ గుంటూరు పశ్చిమలో మాత్రం తెదేపా అభ్యర్ధి విజయ ఢంకా మోగించారు. అప్పట్లో ఎమ్మెల్యే అభ్యర్ధిత్వం లభించని మోహనకృష్ణ తిరిగి గుంటూరు మేయర్ అభ్యర్ధిగా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తెదేపా అధిష్టానం కూడా వచ్చే కార్పోరేషన్ ఎన్నికల్లో కీలకమైన గుంటూరు మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం దృష్టి పెట్టింది. మోహనకృష్ణ అభ్యర్దిత్వాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
గుంటూరు మేయర్ రేసులో మన్నవ మోహనకృష్ణ
Related tags :