NRI-NRT

ఖతార్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు

NRI TRS Qatar Celebrates KTR Birthday In Doha NRI TRS Qatar Celebrates KTR Birthday In Doha  ఖతార్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఖతార్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు

TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడంట్, సిరిసిల్ల శాసన సభ్యులు కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెరాస ఖతర్ ఆధ్వర్యంలో దోహాలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపు మేరకు జన్మదిన వేడుకల్ని నిరాడంబరంగా జరిపి అందుకు బదులుగా ఎన్నారై తెరాస ఖతార్ ఆధ్వర్యంలో జగిత్యాలలో జగ్గసాగర్, పోసాని పెట్ గ్రామాల్లో, మెట్పల్లి, రాఘవ పెట్ పాఠశాలల్లో చిన్నారులకు నొట్ బుక్కులు, పెన్సిల్స్, స్వీట్స్ మరియు ఇతర సామాగ్రి అందచేశారు. ఎన్నారై తెరాస ఖతార్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని కేక్ కట్ చేసి కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని ,ఇండస్ట్రియల్ ఏరియా ఇంచార్జి శంకర్ సుందరగిరి ,యువజన విభాగం అధ్యక్షుడు మహేందర్ చింతకుంట , రామన్న యువసేన అధ్యక్షుడు అండుగుల్ల రాకేశ్ యాదవ్, తెరాస సీనియర్ నాయకులు మల్లేష్ సుధవేని, గోపి మంతెన, మధు మ్యాక,శంకరచారి బొప్పరపు,రాజి రెడ్డి మాసం, తేజా కుంభొజి,ప్రమోద్ కేతే, నర్సింలు,రాజేశం గౌడ్, రాజేశ్వర్, మల్లయ్య, మోహన్ దాస్ దుసా, రాజేష్, విష్ణు వర్ధన్ రెడ్డి,శరత్ బాబు, తెలంగాణ జాగృతి నాయకులు శశాంక్ అల్లకొండ , యెల్లయ్య తాళ్లపెళ్లి , శేఖర్ అల్లకొండ, శేఖర్ చిలువెరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎన్నారై తెరాస ముఖ్య సలహాదారు కల్వకుంట్ల కవిత, ఎన్నారై తెరాస సమన్వయకర్త మహేష్ బిగాలా ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు.

*** In Bahrain

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన వేడుకలను బహ్రెయిన్‌లో ఘనంగా నిర్వహించారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా బహ్రెయిన్‌ ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ ఆధ్వర్యంలో గుడైబియా అండాల్స్‌ గార్డెన్‌లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎన్నారై టీఆర్‌ఎస్‌ శాఖ అధ్యక్షుడు సతీష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కేటీఆర్‌ పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారని, బంగారు తెలంగాణ నిర్మాణానికి కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు ఐటీ కంపెనీలు తెచ్చేందుకు కేటీఆర్‌ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కేటీఆర్‌ జన్మదిన వేడుకల్లో ఉపాధ్యక్షులు వెంకటేశ్‌ బొలిశెట్టి, ప్రధాన కార్యదర్శులు పుప్పాల బద్రి, మగ్గిడి రాజేందర్‌, సెక్రటరీలు సంగేపు దేవన్న, నరేశ్‌ ఎల్లుల, ఉత్కమ్‌ కిరణ్‌ కుమార్‌, సోనా గంగాధర్‌, సంతోష్‌, భూమేష్‌ తదితరులు పాల్గొన్నారు.