DailyDose

టాటా నుండి మూడు కొత్త కార్లు-వాణిజ్య-07/24

TATA To Release Three New Car Models-Telugu Business News Today-July 24 2019

* ఐటీ రంగ దిగ్గజం విప్రో త్వరలో డిజిటల్‌ ప్రొడక్ట్‌ కంప్లియన్స్‌ ల్యాబ్‌ను ప్రారంభించనున్నట్లు బుధవారం వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వినియోగదారుల నమ్మకం, భద్రతను చూరగొనేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 10వేల చదరపుటగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఆటోమోబైల్‌, రక్షణ, కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, వైమానిక రంగం, టెలికామ్‌, మెడికల్‌, ఎనర్జీ, తయారీ రంగాల్లోని వినియోగదారులకు సేవలు అందించేందుకు దీనిని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
* మోటార్స్ నుంచి మూడు కొత్త కార్లు మార్కెట్లోకి రానున్నాయి. వీటిని 2020 ఏడాది చివరికల్లా కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ మూడు కార్లు ప్రీమియం హ్యాచ్ బ్యాక్, 7 సీటర్ ప్రీమియం SUV, మైక్రో SUV కొత్త కార్లను ఇండియన్ మార్కెట్లోకి టాటా ప్రవేశపెట్టనుంది. మార్కెట్‌ని విస్తరించే దిశగా టాటా మోటార్స్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా టాటా మోటార్స్ అల్టోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్‌తో పాటు H7X (కోడ్ నేమ్) 7- సీటర్ SUV, H2X (కోడ్ నేమ్) మైక్రో-SUV మూడు కార్లను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మరీ ఈ కార్లకు సంబంధించిన ఫీచర్లు ఎలా వున్నాయో ఓ సారి చూద్దాం..టాటా అల్టోజ్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్: టాటా ఇంపాక్ట్ 2.0 డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా ఈ కారు డిజైన్ చేశారు. టర్బోఛార్జడ్ యూనిట్‌తో 1.2 లీటర్ కెపాసిటీ ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ కారు ధర (ఎక్స్ షోరూం) రూ.5.5 లక్షల నుంచి రూ.8.5 లక్షల వరకు ఉండనుంది.
* ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) గడువు తేదీని పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31 కాగా..ప్రభుత్వం ఆ గడువు తేదిని ఆగస్టు 31వ తేదీ వరకూ మరో నెల రోజులు పెంచింది. ఇప్పటి వరకు పన్ను చెల్లించని వారుంటే ఆగష్టు 31 లోగా రిటర్నులను సమర్పించాలని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరింది. ఈ గడువు లోపు చెల్లించనట్లయితే రూ.5000 ఫైన్ తో డిసెంబర్ 31, 2019 కల్లా రిటర్నులు దాఖలు చేయాలని తెలిపింది.
*రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీపై దాఖలైన ధిక్కార పటిషన్ను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తోసిపుచ్చింది.
*విద్యుత్ ట్రాక్టర్లను తయారు చేస్తున్న అంకుర సంస్థ కొల్లేస్టియల్ ఇ-మొబిలిటీకి 2,00,000 డాలర్ల (దాదాపు రూ.1.37 కోట్ల) ఏంజెల్ పెట్టుబడులు వచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ అత్యధిక శక్తి ఉన్న బ్యాటరీలతో ఇ-ట్రాక్టర్లను ఉత్పత్తి చేయనుంది.
*ఖాతాల్లో కనీస నిల్వలు లేని వినియోగదారులనుంచి గత మూడేళ్లలో బ్యాంకులు ఛార్జీల రూపంలో రూ.9,721.94 కోట్లు వసూలు చేశాయి.
*నేషనల్ ఫార్మాష్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ముందస్తు అనుమతి లేకుండా మార్కెట్లోకి 22 మందులు ప్రవేశపెట్టిన సంస్థలకు డిమాండ్ నోటీసులు జారీచేసినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి డి.వి.సదానందగౌడ తెలిపారు.
*‘మా ఉత్పత్తులకు అంతకంతకూ ప్రాచుర్యం పెరుగుతుండటం విదేశీ పోటీ కంపెనీలకు అసౌకర్యంగా మారింది. అందుకే మా ఉత్పత్తులపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నార’ని, యోగా గురు రామ్దేవ్ కంపెనీ పతంజలి పేర్కొంది.
*ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యునిలీవర్ (హెచ్యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1,795 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.
*ఆగస్టు 1 నుంచి పలు మోడళ్ల ధరలను రూ.9,200 వరకు పెంచనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ప్రకటించింది. కొత్త మోడళ్లు వెన్యూ, ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోనలను మాత్రం మినహాయించింది.
*డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేపాల్ హైదరాబాద్లో తన గ్లోబల్ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఇప్పటికే చెన్నై, బెంగళూరులలో కేంద్రాలను ఏర్పాటు చేసిన పేపాల్ సైబర్ మోసాల నివారణ సంస్థ సిమిలిటీని 2018లో స్వాధీనం చేసుకోవడం ద్వారా ఇక్కడ కార్యక్రమాలను ప్రారంభించింది.
*కొనుగోలుదార్లకు చెప్పిన సమయానికి ఇళ్లు/ఫ్లాట్లు అప్పగించకుండా ముప్పుతిప్పలు పెడుతున్న స్థిరాస్తి అభివృద్ధిదార్లకు వెన్నులో వణుకు తెప్పించే ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది.
*ఎల్ అండ్ టీకి ఆర్డర్లు కలిసివచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 21.22 శాతం వృద్ధి చెంది రూ.1,472.58 కోట్లకు చేరింది.
*కార్యాలయాల నిర్మాణాల(ఆఫీస్ స్పేస్)కు సంబంధించి హైదరాబాద్లో ఒకప్పుడు పది లక్షల చదరపు అడుగులు దాటితే గొప్ప అనుకున్నారు. అలాంటిది ప్రస్తుతం ఏటా కోటి చదరపు అడుగుల విస్తీర్ణానికి చేరువైంది.
*ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో, దేశీయంగా అగ్రస్థానాన్ని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే ఈ జాబితాలో రిలయన్స్ 42 స్థానాలు పైకి వచ్చి, 106వ స్థానంలో నిలిచింది.