DailyDose

బిగ్‌బాస్‌’కు బెయిల్-నేరవార్తలు–07/24

Telugu Crime News Today - July 24 2019

*జగిత్యాల జిల్లా మాల్యాల గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ గ్రామానికి చెందిన వ్యవసాయ బావిలో మూడు మృతదేహాలు నేడు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని అహల్య, బిన్నుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
* తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌-3 నిర్వాహకులను నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. బిగ్‌బాస్‌ కోర్డినేటర్‌ టీమ్‌ సభ్యులకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. బిగ్‌బాస్‌ కోఆర్డినేటర్స్‌ మహిళలను వేధిస్తున్నారంటూ.. జర్నలిస్ట్‌ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా బిగ్‌బాస్‌ కార్యక్రమ నిర్వాహకులు అభిషేక్, రవికాంత్, రఘులపై బంజారాహిల్స్‌ , రాయదుర్గం పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్‌ అగ్రిమెంట్‌ వ్యవహారంతో పాటు క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉన్నట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌ పోలీసులు వారిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం నోటీసులు అందజేశారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ టీమ్‌ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి వాదనలు విన్నధర్మాసనం బిగ్‌బాస్‌ టీం సభ్యులకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
* దేవరకద్ర పోలీసు స్టేషన్‌ పరిధిలోని నాగారం స్టేజ్‌ వద్ద ఇవాళ మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్‌ స్తంభాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది.
* రాజమండ్రిచిన్నారి జషిత్ కిడ్నాప్ మిస్టరీ ఇంకా వీడలేదు. జషిత్ కిడ్నాప్ అయి 40 గంటలు గడుస్తున్నా పోలీసులకు ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ కిడ్నాప్ కేసు వ్యవహారం పోలీసులకే సవాలుగా మారింది. తూర్పు గోదావరితోపాటు, రాజమండ్రి అర్బన్ పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. ఏడు పోలీసు బృందాలు జిల్లా నలుమూలలా చిన్నారి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నాయి. మండపేట సహా ఉత్తరాంధ్రలోనూ జషిత్ క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ ప్రజలు సర్వ మత ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు.
* గుంటూరు జిల్లాచిలకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో బాబు(35) అనే వ్యక్తి హత్య. వివాహేతర సంబంధం కారణంగా జరిగి ఉండవచ్చని అనుమానం.
హత్య ప్రదేశాన్ని సందర్శించ్చి వివరాలు వెల్లడిస్తున్న రూరల్ సిఐ సుబ్బారావు..
* పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. పాఠశాల ఆవరణలోని ఓ చెట్టు కింద కూర్చొని విద్యార్థులు చదువుతుండగా తేనెటీగలు దాడి చేసినట్లు ఉపాధ్యాయులు, విద్యార్థులు తెలిపారు. తేనెటీగల దాడిలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధిత విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
* సోంలో ఘోర ప్రమాదం జరిగింది. కరీంగంజ్‌లోని ఓ ప్రధాన రహదారిపై వెళ్తున్న రెండు మినీబస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా..30 మందికిపైగా గాయాలయ్యాయి. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. రెండు బస్సుల వేగం ఎక్కువగా ఉండటంతో అవి రహదారిపై పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లాయి.
* కృష్ణా ఉంగుటూరు మండలం ఆత్కూరు జాతీయ రహదారి పై స్వర్ణ భారత్ ట్రస్ట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం…….
బైకును ఢీకొన్న ఆర్టీసీ బస్సు పొట్టిపాడు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం….మిరియాల వీరస్వామి (48) కారుకొండ సురేష్ 32) గుర్తించిన పోలీసులు……మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..
* యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం రంగాపురం గ్రామంలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఏడాదిన్నర వయసున్న తన కూతురుతోపాటు తల్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని హత్మహత్యకు పాల్పడింది.
* కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నిందితుడు వై.ఎస్.ఆర్ కడప జిల్లాకు చెందిన షేక్ ఇస్మాయిల్(43)గా గుర్తించారు.
* షాద్‌నగర్‌లో కారు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్ర దోపిడీ దొంగల ముఠా ఒకటి డమ్మీ వెపన్‌ను చూపించి కారును ఎత్తుకెళ్లింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్టు సీపీ సజ్జనార్‌ స్పష్టం చేశారు.
* కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత తన ఇద్దరు చిన్నారులతో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో చోటుచేసుకుంది.
* మాల్యాల గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ గ్రామానికి చెందిన వ్యవసాయ బావిలో మూడు మృతదేహాలు నేడు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని అహల్య, బిన్నుగా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…
* తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరికి చెందిన ఇద్దరు, కుప్పం మండలం సామగుట్టపల్లి పల్లికి చెందిన ఇంటి యజమనితోపాటు తిరుపతికి చెందిన మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న కుప్పం పోలీసులు.
* కుప్పంలో పట్టుబడ్డ దొంగనోట్ల ముఠా 6 మంది అరెస్ట్.. రూ.రెండు కోట్ల 70 లక్షల 22 వేలు దొంగ నోట్ల స్వాధీనంకుప్పం మండలం సామగుట్టపల్లిలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఏజెంట్ల ద్వారా దొంగనోట్ల చలామణి
* ఒడిశా రాష్ట్రంలోని అనుగుల్‌ జిల్లా భరత్‌పూర్‌ వద్ద బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. మైనింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు సంబంధించిన బొగ్గు గనిలో జరిగిన ప్రమాదంలో 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద ఉన్న మరో నలుగురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
* నిజామాబాద్‌ జిల్లా ముజాహిద్‌నగర్‌లో విషాదం నెలకొంది. నిన్న మధ్యాహ్నం 3గంటల నుంచి కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు రియాజ్‌ (10), మహమ్మద్‌ (5)లు కారులో ఊపిరాడ మృతి చెందారు. ఆడుకుంటూ పక్కింటి వాళ్ల కారులోకి వెళ్లిన చిన్నారులు డోర్‌ లాక్‌ కావడంతో ఊపిరాడక మృతి చెందారు. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. చిన్నారుల మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
* ఆర్థిక సమస్యలు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్‌నగర్‌ కాలనీకి చెందిన పారేపల్లి లోకేశ్వర్‌, చిత్రకళ(37) దంపతులకు లోహిత్‌కుమార్‌(12), శ్రీ విఘ్నేశ్‌ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
* ముజాహిద్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మృతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు రియాజ్(10), మహ్మద్(5)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి చిన్నారులు కనిపించకుండా పోయారు. దీంతో చిన్నారుల అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
* ఖమ్మం జిల్లా వైరాలో RTC బస్సులో ప్రయాణిస్తున్న గుండేటి శ్రావణ్ 27, అనారోగ్యంతో మృతి .కొత్తగూడెం నుండి ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు…
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ లో ఆటోను ఢీకొట్టిన లారీ ఆటో డ్రైవర్ పరిస్థితి విషమం. ప్రభుత్వ హాస్పటల్ కు తరలింపు…
* సత్తుపల్లి మండలం రెజర్ల గ్రామం లో గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి నీ అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 13 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్న చింతలపూడి(ఆంధ్ర) పోలీస్ లు.చింతలపూడి కి చెందిన మరో వ్యక్తి తో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న గోవర్ధన్ రెడ్డి…
* ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య యత్నం తల్లి, కుమారుడు మృతి తండ్రి పరిస్థితి విషమం. మిర్యాలగూడ పట్టణం సంతోష్ నగర్ లో ఘటన…
*భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీ నివాస్‌ మిత్తల్‌ సోదరుడు ప్రమోద్‌ మిత్తల్‌ను ఐరోపాలోని బోస్నియాలో అరెస్టు చేసినట్లు సమాచారం.
*జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం సర్వాపూర్‌లో విషాదం నెలకొంది. ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ తల్లి బావిలో దూకింది.
*మిర్యాలగూడలోని సంతోష్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఓ కుటుంబం పురుగుల మందు సేవించి ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చనపోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
*నిజామాబాద్‌ నగరంలోని ముజాహిద్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఇద్దరు బాలురు ఓ కారులో శవాలై తేలారు.
*చిలకలూరిపేట మండలం మురికిపూడిలో దారుణం జరిగింది. బాబు (35) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*ఉప్పల్ పీఎస్ పరిధి రామంతపూర్‌లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన మహేష్(20) అనే వ్యక్తి అత్యాచారం చేశాడని బాలిక తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బతుకు తెరువుకోసం నగరానికి వచ్చి రామంతపూర్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
*నిజామాబాద్ జిల్లా ముజాహిద్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. కారులో ఊపిరాడక ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మృతులిద్దరూ అక్కాచెల్లెళ్ల కుమారులు రియాజ్(10), మహ్మద్(5)గా గుర్తించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి చిన్నారులు కనిపించకుండా పోయారు. దీంతో చిన్నారుల అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
*ఖమ్మం జిల్లా వైరాలో RTC బస్సులో ప్రయాణిస్తున్న గుండేటి శ్రావణ్ 27, అనారోగ్యంతో మృతి .కొత్తగూడెం నుండి ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు…
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ అంబేద్కర్ సెంటర్ లో ఆటోను ఢీకొట్టిన లారీ ఆటో డ్రైవర్ పరిస్థితి విషమం. ప్రభుత్వ హాస్పటల్ కు తరలింపు.
* సత్తుపల్లి మండలం రెజర్ల గ్రామం లో గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి నీ అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 13 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్న చింతలపూడి(ఆంధ్ర) పోలీస్ లు.చింతలపూడి కి చెందిన మరో వ్యక్తి తో కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న గోవర్ధన్ రెడ్డి.
*బీహార్ రాష్ట్రంలో వరద విపత్తు వల్ల 106 మంది మరణించారు. అసోం రాష్ట్రంలో 68 మంది మృత్యువాత పడ్డారు. అసోంలోని కజిరంగ జాతీయ పార్కులో ఉన్న వన్యప్రాణుల్లో 204 ప్రాణులు వరదల్లో మరణించాయి. బీహార్ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 80.5 లక్షల మందిని సహాయపునరావాస శిబిరాలకు తరలించారు.
*ఆర్థిక సమస్యలు తాళలేక ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మిర్యాలగూడలో చోటుచేసుకుంది.
*కశింకోట మండలం నూతన గుంటపాలెం జంక్షన్ దగ్గర పలాస డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు -లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
*మిర్యాలగూడలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. భార్య చిత్రకళ(40), కుమారుడు లోహిత్(12) మృతిచెందారు. భర్త లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణంగా తెలుస్తోంది.
*తమిళనాట మదురై ప్రాంతంలో నివసించే వృద్ధులైన తల్లిదండ్రుల నుంచి ఆస్తిని లాక్కొని వారిని వృద్ధాశ్రమంలో చేర్చిన కుమార్తెలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆస్తి తిరిగి కన్నవారికే స్వాధీనపరిచారు.
*కడప జిల్లా జమ్మలమడుగులో పెద్దఎత్తున నాటు బాంబులు బయటపడ్డాయి. జమ్మలమడుగు-ముద్దనూరు రహదారి పెన్నానది సమీపంలో ప్లాట్లు వేసేందుకు భూమిని పొక్లెయిన్తో చదును చేసే పనులు పది రోజులుగా జరుగుతున్నాయి.
* రైల్వేస్టేషన్లలో ఆహారపదార్థాలు కొని తిని అస్వస్థుడినయ్యానంటూ..నిలువునా వంచనకు దిగుతున్న ఓ ప్రబుద్ధుడిని పోలీసులు కనిపెట్టారు. సుందర్ పాల్ అనే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
* భూ వివాద విషయంలో మహిళను కారుతో ఢీకొట్టి సినీఫక్కీలో హత్యాయత్నం చేసిన ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని చించాల గ్రామంలో చోటుచేసుకుంది.
*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్రెడ్డిని ఫోన్లో బెదిరించిన షేక్ ఇస్మాయిల్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.
*హీరా గ్రూపు సంస్థల అధినేత్రి నౌహీరా షేక్కు రంగారెడ్డి జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అధిక లాభాలు చూపిస్తానని ప్రజల నుంచి రూ.కోట్లు సేకరించి ఆ సొమ్మును దారి మళ్లించిన కేసులో ప్రధాన నిందితురాలు.
*ప్రేమించే మనసు తల్లడిల్లింది. ప్రేమికురాలు దూరం కావడంతో తట్టుకోలేకపోయింది. ప్రేమించిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కలతచెందిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషాదమిది.
*కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. షేక్ ఇస్మాయిల్ ఇంటర్నెట్ వాయిస్ కాల్ ద్వారా కేంద్రమంత్రిని బెదిరించారు. మంత్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి కడప జిల్లాకు చెందిన షేక్ఇస్మాయిల్గా గుర్తించారు. ఈ మేరకు అతడిని అరెస్టు చేశారు. గతంలోనూ పలుమార్లు కిషన్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
*తూర్పుగోదావరి జిల్లా మండపేట సమీపంలోని విజయలక్ష్మీ నగర్లో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.
* హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీ కాలనీలో ఓ బ్యుటీషియన్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులతోనే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
*విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం ఎన్.జి.పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని పలాస నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు తమ వాహనాల్లో క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సును పలాస డిపోకు చెందినదిగా గుర్తించారు. ఘటనా సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
*ఏపీలోని విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం ఎస్.జి.పాలెం వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చికిత్స నిమిత్తం పోలీసు వాహనాల్లో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పలాస నుంచి విజయవాడ వెళ్తున్న పలాస డిపో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
*కుటుంబ కలహాలతో కూతురితో సహా మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని పాత రంగాపూర్లో జరిగింది.
*తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి రెడ్డియార్ పట్టి గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తిరునల్వేలి మాజీ మేయర్ ఉమామహేశ్వరి, ఆమె భర్త ఉమామురుగశంకర్, పనిమనిషి మారిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో ఇంట్లో పడిఉన్న ముగ్గురిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు భూతగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
*చిత్తూరు జిల్లాలోని కణంమెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడుకు చెందిన ఆర్టీసీ బస్సు – కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
*సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో ఓ లాడ్జిలో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.