దేశంలోని 23 విశ్వవిద్యాలయాలకు గుర్తింపు లేదని, అవి నకిలీవని విశ్వవిద్యాలయాల గ్రాంట్ల కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. వాటిలో 8 ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నాయి. విద్యార్థులు ఆయా సంస్థలలో చేరొద్దని యూజీసీ హెచ్చరించింది. ఈ విద్యాసంస్థలన్నీ యూజీసీ చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని యూజీసీ కార్యదర్శి రజనీశ్ జైన్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో వారణాసీయ సంస్కృత విశ్వవిద్యాలయ (వారణాసి), మహిళా గ్రామ విద్యాపీఠ/విశ్వవిద్యాలయ (ప్రయాగ్‌రాజ్), గాంధీ హిందీ విద్యాపీఠ్ (వారణాసి), నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (కాన్పుర్), నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ (అలీగఢ్), ఉత్తర్‌ప్రదేశ్ విశ్వవిద్యాలయ (మథుర), మహారాణా ప్రతాప్ శిక్షానికేతన్ విశ్వవిద్యాలయ (ప్రతాప్‌గఢ్), ఇంద్రప్రస్థ శిక్షాపరిషద్ (నోయిడా)లకు గుర్తింపు లేదు. దిల్లీలో కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, వొకేషనల్ యూనివర్సిటీ, ఏడీఆర్-సెంట్రిక్ జురిడికల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ, విశ్వకర్మ ఓపెన్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌లను నకిలీలుగా ప్రకటించారు. కర్ణాటకలోని బడగావి సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ, కేరళలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ, మహారాష్ట్రలోని రజా అరబిక్ యూనివర్సిటీ, పుదుచ్చేరిలోని శ్రీబోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా నకిలీవేనని చెప్పారు. పశ్చిమబెంగాల్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్, ఒడిశాలోని నవభారత్ శిక్షాపరిషత్, నార్త్ ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీలకు సైతం గుర్తింపు లేదని రమేశ్ జైన్ చెప్పారు. లఖ్‌నవూలోని భారతీయ శిక్షాపరిషత్ విషయం మాత్రం ఇంకా విచారణలో ఉందన్నారు.
భారతదేశంలో 23 నకిలీ యూనివర్శిటీలు
Related tags :