గ్లామరస్ హీరోయిన్లు రాజ్యమేలుతున్న సమయంలో తన పర్ ఫార్మెన్స్ తోనే స్టార్ అయ్యింది విద్యాబాలన్. మిగతా నటీమణుల్లాగా తీగలాంటి రూపం లేకపోయినా…ఎవరికీ తీసిపోనని తన నటనతో ప్రూవ్ చేసింది. రీసెంట్ గా సౌత్ లోనూ అడుగుపెట్టింది. తెలుగులో ఎన్టీయార్ బయోపిక్ చేశాక తమిళంలో ‘నేర్కొండ పార్వై’ కోసం అజిత్ తో జోడీ కట్టింది. ఈ మూవీతో పాటు హిందీ చిత్రం ‘మిషన్ మంగళ్ ’ కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోపు మరో కొత్త అడుగు వేసింది విద్య.‘నట్ ఖట్ ’ అనే షార్ట్ ఫిల్మ్‌లో యాక్ట్ చేసింది. అంతేకాదు… రోనీ స్క్రూవాలాతో కలిసి దాన్ని నిర్మించింది కూడా. ‘నిజానికి నేను ప్రొడ్యూసర్ అవుదామనుకోలేదు. ఆ కథ చాలా నచ్చడంతో అనుకోకుండా అటువైపు అడుగేశాను. దర్శకుడు షాన్ వ్యాస్ ఒక పవర్ ఫుల్ స్టోరీని ఎంతో అందంగా చిత్రీకరిస్తున్నాడు. ఇది ఎప్పుడు బైటికొస్తుందా అని ఎక్సయిటింగ్ గా ఉంది’ అంటోంది విద్య. బిగ్ ఫిల్మయినా షార్ట్ ఫిల్మయినా ఆమెకి ఒకటే.. ఎందుకంటే తను విద్య. ఏ పాత్రయినా అదరగొట్టడమే తెలుసామెకి.
అనుకోకుండా అదరగొట్టేసింది
Related tags :