DailyDose

తాగి కారు నడిపితే పదివేలు ఫైన్‌‌-నేరవార్తలు–07/25

10000 INR Fine If you DUI-Telugu Crime News Today - July 25 2019 - తాగి కారు నడిపితే పదివేలు ఫైన్‌‌-నేరవార్తలు–07/25

*ఇకపై బండి చాలా జాగ్రత్తగా నడపాలి. ఏ మాత్రం కాస్త అటూఇటైనా జేబుకు భారీ చిల్లు తప్పదు. కొత్తగా అమల్లోకి రాబోతున్న ‘మోటార్‌‌ వెహికల్‌‌ సవరణ బిల్లు- 2019’తో ఫైన్ల మోత మోగనుంది. అంబులెన్స్‌‌కు దారివ్వకున్నా, డ్రంకన్‌‌ డ్రైవ్‌‌లో దొరికినా భారీగా ఫైన్‌‌ కట్టాల్సిందే. కొన్ని కేసుల్లోనైతే ఏకంగా ఊచలు లెక్కించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మైనర్లకు బండిస్తే ఓనర్‌‌కు 25 వేల ఫైన్‌‌తోపాటు మూడేళ్ల జైలు శిక్ష వేస్తారు. ఆర్సీ కూడా రద్దవుతుంది. మద్యం తాగి, మత్తు పదార్థాలు తీసుకుని డ్రైవింగ్‌‌ చేస్తే ఇప్పటివరకున్న ఫైన్‌‌ రూ.2 వేలు. దాన్నిప్పుడు రూ.10 వేలకు పెంచారు.కేంద్రం ‘మోటార్‌‌ వెహికల్‌‌ సవరణ బిల్లు- 2019’ను లోక్‌‌సభలో ప్రవేశపెట్టింది. త్వరలో దీన్ని రాజ్యసభలోనూ పెడతారు. ఈ సవరణ బిల్లును 2017లోనే లోక్‌‌సభలో పెట్టి ఆమోదించగా, రాజ్యసభలో వీగిపోయింది. తాజాగా దీనికి మరికొన్ని సవరణలు చేసి తీసుకొచ్చారు.
ఏదైనా వెహికల్‌‌ తయారీ సంస్థ ప్రమాణాలు పాటించలేదని తేలితే రూ .100 కోట్ల వరకు జరిమానా లేదా ఓనర్‌‌కు ఏడాది జైలు పడనుంది. కొన్ని సందర్భాల్లో రెండూ పడే అవకాశముంది. రోడ్డు వేయడంలో నాణ్యత పాటించకుంటే కాంట్రాక్టర్‌‌కు లక్ష రూపాయల ఫైన్‌‌ వేస్తారు. ఈ జరిమానాలన్నింటినీ ప్రభుత్వం ఏటా 10% దాకా పెంచుకోవచ్చు. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ట్రీట్‌‌మెంట్‌‌కోసం గోల్డెన్‌‌ అవర్‌‌ పథకంలో మార్పులు చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారమూ మారనుంది. ప్రమాదంలో చనిపోతే రెండు లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ .50 వేల వరకు చెల్లిస్తారు.కొత్త బిల్లు ప్రకారం ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ అగ్రిగేటర్లను నియంత్రించే అధికారం ప్రభుత్వానికుంది. ఇప్పటివరకు చట్టంలో క్యాబ్ అగ్రిగేటర్లను గుర్తించలేదు. ఈ చట్టంలో ‘అగ్రిగేటర్స్’ అనే పదాన్ని చేర్చడం వల్ల ఆయా సంస్థలకు రూల్స్‌‌ రూపొందించడానికి, చర్యలు తీసుకోవడానికి కేంద్రానికి అధికారం ఉంటుంది. దేశంలోని వెహికల్‌‌ ఉన్న వారందరికీ తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌‌ కల్పించడానికి ‘మోటారు వెహికల్‌‌ యాక్సిడెంట్‌‌ ఫండ్‌‌’ ఏర్పాటు కానుంది. ప్రమాదాల్లో గాయపడిన వారికి ట్రీట్‌‌మెంట్‌‌, ‘హిట్ అండ్ రన్‌‌’లో చనిపోయిన పరిహారం ఈ ఫండ్‌‌ ద్వారా అందనుంది. ఈ బిల్లుతో ఆయా రాష్ట్రాల రవాణా శాఖలకూ భారీగా ఇన్‌‌కం రానుంది.
*వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన గురువారం వెలుగు చూసింది. స్థానిక వివరాల మేరకు.. మదనపల్లె నీరుగట్టువారిపల్లి చౌడేశ్వరి ఆలయం బైపాస్‌ రోడ్డు వద్ద ఉన్న మహేష్‌ వైన్స్‌ షాప్‌ సమీపంలో వ్యక్తి దారుణ హత్య కు గురయ్యాడు.
*జవహార్ నగర్ పి.యస్ పరిధిలో దారుణం. బాలాజీ నగర్, వికలాంగుల కాలనీ సమీపంలో, శాంతి (28) అనే మహిళను తన ఇంట్లో కిరాతకంగా కత్తెరతో గొంతులో పొడిచి చంపిన భర్త విజయ్ (30). హత్య చేసిన అనంతరం అక్కడి నుండి పరారైన హంతకుడు విజయ్.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపడుతున్నారు.హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది..
*శంకర పల్లి పోలీస్ స్టేషన్ నుండి నిందితుడు పరారు.దొంగతనం కేసులో అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కి తీసుకొచ్చిన పోలీసులు.ఓ దొంగతనం కేసులో ఈ నెల 9 న నాగర్ కర్నూల్ కి చెందిన నాగరాజు అరెస్ట్. పోలీస్ స్టేషన్ నుండి పోలీసులకు కళ్లుగప్పి పరారైన నిందితుడు.ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన , నిందితుడు కోసం గాలిస్తున్న పోలీసులు.
*పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నార్త్ పరగణాస్ జిల్లాలోని బరాక్ పోరి పట్టణంలోని బీజేపీ ఎంపీ అర్జున్‌సింగ్ ఇంటిపై బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బాంబు విసిరారు. జగత్‌దల్ పోలీసుస్టేషను పరిధిలోని బీజేపీ ఎంపీ ఇంటిపై ఆగంతకులు బాంబు వేయడమే కాకుండా కాల్పులు కూడా జరిపారు.
*కూకట్‌పల్లిలో ప్రగతినగర్‌లో భర్తను భార్య చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పెళ్లైన కొద్దిరోజులకే భార్యను వదిలేసిన భర్త.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విడాకులివ్వమని భార్య కోరినప్పటికీ ఎంతకీ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన భార్య తన బంధువులతో కలిసి వచ్చి భర్తపై దాడి చేసింది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
*హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో.. దారుణం జరిగింది. రవి అనే వ్యక్తిని.. పెట్రోలు పోసి తగలబెట్టారు దుండగులు. అతని మృతదేహాం.. యాచరంలోని చెట్ల పొదల్లో లభ్యమైంది. అయితే.. బిచ్చనాయక్‌ అనే వ్యక్తి ఈ హత్య చేశాడంటున్నారు రవి కుటుంబసభ్యులు. బిచ్చనాయక్‌ రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నాడని , ఆ డబ్బు ఇస్తానని రవిని తీసుకెళ్లి చంపేశాడంటున్నారు. తమకు న్యాయం చేయాలంటున్నారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*నెల్లూరు జిల్లానగరంలో 8మంది నకిలీ విలేకర్ల ను అరెస్టు చేసిన దర్గామిట్ట పోలీసులు.విలేకరులమంటూ వ్యభిచార గృహాలు,గుట్కా షాపుల వద్దకు వెళ్లి మామూళ్లు వసూలు చేస్తున్న వైనం.నకిలీ విలేకర్ల నుండి 70 వేలు నగదు,నకిలీ లోగోలు స్వాధీనం .
*గుర్తుతెలియని వాహనం ఢీకొని తండ్రి, కొడుకు ఇద్దరూ మృతిచెందారు. ఈ విషాదం సంఘటన నల్లగొండ జిల్లాలోని అన్నెపర్తి స్టేజ్ వద్ద చోటుచేసుకుంది.
*రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో గల గాయత్రి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అఖిల అనే విద్యార్థిని మృతిచెందింది. కళాశాలలో విద్యార్థిని అస్వస్థతకు గురవ్వగా హుటాహుటిన చికిత్స నిమిత్తం గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*మెట్‌పల్లిలో ఇద్దరు చిన్నారులను గంగజ్యోతి అనే మహిళ అమ్మకానికి పెట్టింది. స్థానికుల సమచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు గంగజ్యోతిని అదుపులోకి తీసుకుని కరీంనగర్‌ సదార్‌ హోంకు తరలించారు. అయితే సదార్‌ హోంలోనే గంగజ్యోతి చిన్నారులను వదిలి వెళ్లిపోయింది. చిన్నారులను కిడ్నాప్‌ చేసి తీసుకువచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి చిన్నారులను శిశుగృహకు తరలించి డీఎన్‌ఏ పరీక్ష చేయించారు.
*విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతిచెందిన ఘటన దేవరపల్లి మండలం త్యాజంపూడిలో గురువారం చోటుచేసుకుంది.
* మేడ్చల్ జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్‌లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వికలాంగులకాలనీ సమీపంలో భార్యను హత్య చేసిన భర్త పరారయ్యాడు. భార్య శాంతి(28)ని ఆమె భర్త విజయ్ కత్తెరతో పొడిచి చంపేశాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*చైనాలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో 16 మంది మృతి చెందారు. మరో 30 మంది గల్లంతయ్యారు. గుయిజ్‌హౌ ప్రావిన్స్‌లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి.
*ఒడిశాలోని బొగ్గు గని కూలి నలుగురు కార్మికులు మృతి చెందగా.. 10 మంది గాయపడ్డారు. అనుగుల్ జిల్లా భరత్పూర్ ప్రాంతంలో ఉన్న మహానది కోల్ఫీల్డ్ లిమిటెడ్(ఎంసీఎల్) సంస్థకు చెందిన బొగ్గు గనుల్లో ఈ ప్రమాదం జరిగింది.
*కారులో దర్జాగా ప్రయాణం. ధనవంతుడిగా డాబు. రాష్ట్రంలో ఎవరికైనా..ఏ ఉద్యోగమైనా ఇప్పించ గల సమర్థత ఉందనేలా హావభావాలు. అవే పెట్టుబడిగా ఓ చిరు వ్యాపారిని బుట్టలో వేసుకున్నాడో మాయగాడు.
*ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీపై ఆ సంస్థ కేసు నమోదు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద ఆయనపై మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదైంది.
*బిహార్, ఝార్ఖండ్లలో పిడుగుపాటుకు 51 మంది మృతి చెందారు. మంగళవారం రాత్రి నుంచి ఈ ఘటనలు సంభవించినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. బిహార్లో 39 మంది, ఝార్ఖండ్లో 12 మంది మరణించారు. భారీ వర్షాలతో ఆ రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
*తన సోదరి ఇంట్లో జరుగుతున్న పండుగకు హాజరయ్యేందుకు ఓ వ్యక్తి గుర్రపు స్వారీ చేసుకొంటూ వెళ్తుండగా విద్యుదాఘాతానికి గురై గుర్రంతోపాటు మృతిచెందిన ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
*ఆడుకుంటూ కారులోకి వెళ్లిన చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలో మంగళవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* ఇద్దరు కుమార్తెలతోపాటు ఓ మహిళ వ్యవసాయబావిలో పడి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
*మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కనకదుర్గ శీతల గిడ్డంగిలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం 11:30 సమయంలో విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని గిడ్డంగి భాగస్వామి అభిషేక్ తెలిపారు.
*జగిత్యాల జిల్లా మెట్పల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ పాఠశాలను అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం యజమాని గణేశ్ బోరు వేయిస్తుండగా మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ పగిలింది.
*తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని విజయలక్ష్మీనగర్లో జషిత్ అనే బాలుడి అపహరణ కేసులో కొన్ని ఆధారాలు లభ్యమైనట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి చెప్పారు.
*జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బాలాజీ నగర్వికలాంగుల కాలనీ సమీపంలో శాంతి (28) అనే మహిళను భర్తే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నేటి ఉదయం శాంతిని ఆమె భర్త విజయ్(30) తమ నివాసంలోనే కత్తెరతో గొంతులో పొడిచి చంపాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
* ప్రముఖ సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నగరంలో తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఇంద్రగంటి భార్య జానకీబాల కూడా రచనారంగంలో స్థిరపడ్డారు. ప్రముఖ సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఆయన తనయుడన్న విషయం తెలిసిందే. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన రచయితగా స్థిరపడ్డారు.