Business

భారతీయుల కోసం ప్రత్యేక NetFlix ధరలు

Cheaper Plans For Indian NetFlix Users

రిలయన్స్‌ జియో పుణ్యమా అని దేశంలో మొబైల్‌ డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. దీనికి తోడు అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌ స్టార్‌ వంటి ఓటీటీ సర్వీసుల వాడకమూ ఊపందుకుంది. దీంతో వాల్ట్‌డిస్నీ్కి చెందిన నెట్‌ఫ్లిక్స్‌ సైతం దూకుడు పెంచింది. దేశంలో తన వినియోగదారులను పెంచుకునేందుకు భారతీయుల కోసం ప్రత్యేకంగా ఓ చౌక ప్లాన్‌ను తీసుకొచ్చింది. నెలకు రూ.199కే ఈ సేవలను అందిస్తోంది. అయితే ఇది కేవలం మొబైల్‌, ట్యాబ్లెట్‌ వినియోగదారులకు మాత్రమే. వాస్తవంగా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌ నెలవారీ ప్లాన్‌ రూ.499 నుంచి ప్రారంభమవుతుండగా.. ఈ చౌక ప్లాన్‌ను కేవలం రూ.199కే అందిస్తోంది. బుధవారం (జులై 24) నుంచే ఈ ప్లాన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. చౌక ప్లాన్‌ను తీసుకొచ్చిన నెట్‌ఫ్లిక్స్‌ కొన్ని పరిమితులను కూడా విధించింది. వీడియోలు SD (480P)లో మాత్రమే స్ట్రీమ్‌ అవుతాయి. ఒకసారి ఒకరు మాత్రమే ఉపయోగించే విధంగా మార్పులు చేసింది. పైగా టీవీలో ఉపయోగించుకునే వీలులేదు. ఈ చౌక ప్లాన్‌ ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. చౌక ప్లాన్‌ తీసుకొచ్చినప్పటికీ రూ.499, రూ.649, రూ.799 ప్లాన్లు యథావిధంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం హాట్‌స్టార్‌ నెలవారీ ప్లాన్‌ రూ.299 ఉండగా.. అమెజాన్‌ ప్రైమ్‌ నెలకు రూ.129 చొప్పున వసూలు చేస్తోంది. ఈ కొత్త ప్లాన్‌ ద్వారా తమ సేవల వినియోగం మరింత పెరుగుతుందని, వినియోగదారులు తమ సేవలు ఇష్టపడతారని ఆ కంపెనీ ప్రొడక్ట్‌ ఇన్నోవేషన్‌ డైరెక్టర్‌ అజయ్‌ అరోరా ఆశాభావం వ్యక్తంచేశారు.