ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పీపీఏల పున:సమీక్షకు సంబంధించి ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖలను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది హైకోర్టు. అలాగే పీపీఏల పున: సమీక్షకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీపై నాలుగు వారాలపాటు స్టే విధించింది. పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు పీపీఏల పున:సమీక్షకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక నిపుణుల కమిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో 40 ప్రైవేట్ విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏలపై సమీక్ష కోసం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జీవో 63ను రద్దు చేయాలని కోరాయి. కాంపిటేటివ్ పద్దతిలోనే తాము బిడ్డింగ్ దక్కించుకున్నట్లు సంస్థలు స్పష్టం చేశాయి. ఏపీ రెగ్యులరేటరీ, ఏపీ ఈఆర్సీ ఆమోదంతోనే బిడ్డింగ్ డిస్కంలతో ఒప్పందం చేసుకున్నామని విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి. గతంలో చెల్లించిన బిల్లులను పున: సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం ఏకపక్షమని విద్యుత్ సంస్థలు హైకోర్టులో తమ వాదనలు వినిపించాయి. బిల్లులను పున:సమీక్షించే అధికారం కేవలం డిస్కింలకు మాత్రమే ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థలు హైకోర్టులో తమ వాదనలు వినిపించాయి. 40 విద్యుత్ పంపిణీ సంస్థలు సుమారు 15 పిటీషన్లను దాఖలు చేయగా వాటిపై జస్టిస్ ఎం.గంగారావ్ విచారణ చేపట్టారు. గురువారం ఉదయం నుంచే ఈ పిటీషన్లపై వాదనలు జరిగాయి. ఇరువాదనలు విన్న హైకోర్టు పీపీఏల పున:సమీక్షించుకోవాలన్న ప్రభుత్వ తీరు ఆక్షేపనీయంగా ఉందంటూ హైకోర్టు అభిప్రాయపడింది. తీర్పును ఆగష్టు 22కు వాయిదా వేస్తూ విచారణ వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పుడే చిక్కులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం విషయంలోనే కాదు, ఇతర విషయాల్లోనూ ఆయన పలు చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది తాజా పరిణామాలను పరిశీలిస్తే అర్థమవుతోంది.అమరావతి నిర్మాణం ప్రాజెక్టు నుంచి ప్రపంచ బ్యాంక్ మాత్రమే కాకుండా చైనాకు చెందిన ఏషియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఎఐఐబి) కూడా వెనక్కి తగ్గింది. దీంతో అమరావతి నిర్మాణం కోసం పెట్టుబడులను రాబట్టడం ఎలా అనేది జగన్ అత్యంత తీవ్రమైన విషయమే అవుతుంది.తాజా పరిణామాల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది. రియల్ ఎస్టేట్ పడిపోవడానికి అమరావతి నిర్మాణం నుంచి బ్యాంకులు తప్పుకోవడం మాత్రమే కారణం కాదు, ప్రభుత్వం ఇసుక విధానాన్ని కేంద్రీకృతం చేయడం కూడా కారణం. దానివల్ల భవన నిర్మాణాలకు ఇసుక లభించడం లేదు. ఈ సమస్యను జగన్ పరిగణనలోకి తీసుకోవాల్సే ఉంది.అమరావతి ప్రాజెక్టు నుంచి రెండు ప్రధాన బ్యాంకులు తప్పుకోవడమే జగన్ ప్రభుత్వానికి తీవ్రమైన దెబ్బ అయితే, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నుమచి కొరియాకు చెందిన ఎగ్జిమ్ బ్యాంక్ వెనక్కి వెళ్లింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పట్టాలని అనుకునేవాళ్లు పునరాలోచన చేసే పరిస్థితి ఏర్పడింది. పెట్టుబడులు రాకపోతే జగన్ తీవ్రమైన కష్టాలనే ఎదుర్కోవాల్సి వస్తుంది.రాజకీయంగా కూడా జగన్మోహన్ రెడ్డికి చిక్కులు ప్రారంభమయ్యాయి. బిజెపి నేతలు జగన్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు పరిస్థితే జగన్మోహన్ రెడ్డికి పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడడం వల్ల పెనం నుంచి పొయ్యిలో పడినట్లయిందని వారు వ్యాఖ్యానించారు బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, నేతలు దగ్గుబాటి పురంధేశ్వరి, మాధవ్ తదితరులు జగన్ ను లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు.బిజెపి లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాబట్టి జగన్మోహన్ రెడ్డిని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్న తరుణంలో కేంద్రం చేయూత అందించే పరిస్థితి కూడా లేదు. రాష్ట్రానికి కేంద్రం నుంచి 80 వేల కోట్లు రావాల్సి ఉంది. అయితే, ఆ నిధులను కేంద్రం విడుదల చేస్తుందా, లేదా అనేది కూడా సందేహంగానే ఉందిరాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడానికి ప్రధానంగా పనిచేసింది అమ్మ ఒడి పథకం. అమ్మ ఒడి పథకం అమలు విషయంలో జగన్ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండింది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని జగన్ చెప్పగానే విమర్శలు ప్రారంభమయ్యాయి. దాంతో ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే అది వర్తిస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. అది కాస్తా వ్యతిరేక ఫలితం ఇస్తుందని భావించి, ఆ పథకం ప్రైవేట్ పాఠశాలలకు కూడా వర్తిస్తుందని జగన్ చెప్పారుప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తానని జగన్ చెబుతున్నారు. అయితే, అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా వర్తింపజేసినప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రులను తమ పిల్లలను చేరుస్తారా అనేది అనుమానమే. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండకపోవచ్చుగ్రామ సచివాలయాలకు కొత్త ఉద్యోగులను తీసుకుంటామని జగన్ చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఉద్యోగులను ఏం చేస్తారనే స్పష్టత లేదు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడానికి లక్షా 30 వేల మంది గ్రామ వాలంటీర్లను నియమిస్తామని జగన్ చెప్పారు. నిజానికి, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ జర్మనీలో ఉంది.జర్మనీలోనూ, ఇతర దేశాల్లోనూ సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నన్ని లేవు. అక్కడ ఒక్క పథకం మాత్రమే ఉంటుంది. దాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా అమలు చేస్తారు. అయితే, గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మరో జన్మభూమి పథకంలా తయారు కాదని చెప్పలేని పరిస్థితి. గ్రామ వాలంటీర్లుగా వైసిపికి చెందినవారినే వియమిస్తే అది చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని జన్మభూమి పథకంలా మారే ప్రమాదం ఉంది. తెలుగుదేశం పార్టీ ఓటమికి జన్మభూమి పథకమే ప్రధాన కారణమని విశ్లేషకులు అంచనా వేశారు.
హైకోర్టులో జగన్ సర్కార్కు చుక్కెదురు
Related tags :