మలేషియా మాజీ రాజు సుల్తాన్ మహమ్మద్ తన భార్య, మిస్ మాస్కో రిహానా ఓక్సానా గొర్బాటెంకోకు ట్రిపుల్ తలాక్ పద్ధ్దతిలో విడాకులిచ్చాడని సింగపూర్కు చెందిన ఆయన న్యాయవాది కోహ్ తైన్ హువా ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 22న షరియత్ చట్టాలను అనుసరించి సుల్తాన్ మహమ్మద్.. తన భార్య రిహానాకు మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు ఇచ్చారు అని అన్నారు. అయితే న్యాయవాది ప్రకటనను రిహానా ఓక్సానా గర్బాటెంకో తోసిపుచ్చారు. తన భర్త సుల్తాన్ మహమ్మద్ నేరుగా తనకు విడాకులిచ్చినట్లు చెప్పలేదన్నారు. సుల్తాన్ మహమ్మద్కు, తనకు జన్మించిన కుమారుడు ఉన్నాడంటూ ఆమె తమ ముగ్గురి ఫొటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. రిహానాతో వివాహం వెలుగులోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాజుగా సుల్తాన్ మహమ్మద్ పదవీ త్యాగం చేశారు.
త్రిపుల్ తలాక్ చెప్పిన మలేషియా రాజు
Related tags :