* కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లకు సంబంధించి కరెంట్ బిల్లు మోత మోగింది. ఒక్క కన్నెపల్లి పంప్‌హౌస్ కరెంటు బిల్లు రూ.20.64 కోట్లకు చేరింది. దీంట్లో పాత బకాయిలు రూ.8 కోట్ల వరకు ఉన్నట్లు ట్రాన్స్ కో ఇంజనీర్లు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా జూన్ 21న సీఎం కేసీఆర్ మేడిగడ్డ సమీపంలోని కన్నెపల్లి పంప్హౌస్‌లో మోటార్లను ఆన్ చేశారు. అప్పట్నుంచి ఇప్పటివరకు 5.7 టీఎంసీల నీటిని అన్నారం బ్యారేజీకి పంపింగ్ చేశారు. భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కావటంతో దీనికి సంబంధించిన కరెంటు బిల్లు ఎంత వచ్చిందనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ప్రతి నెలా 23వ తేదీన ట్రాన్స్‌కో ఇంజినీర్లు ఇక్కడ మీటర్ రీడింగ్ తీస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో కన్నెపల్లి పంప్‌హౌస్‌కు 1.96 కోట్ల యూనిట్ల విద్యుత్తు వాడినట్లు తాజా రీడింగ్‌లో తెలిసింది.తెలంగాణ ఈఆర్‌సీ నిర్దేశించిన మేరకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు వాడుకునే కరెంట్‌కు ఒక్కో యూనిట్‌కు ఆరు రూపాయల చొప్పున బిల్లు లెక్కగట్టారు. దీంతో ఈ నెలలో కన్నెపల్లి కరెంటు బిల్లు రూ.12.64 కోట్లు, అంతకు ముందు జూన్ 24 వరకు ఈ పంప్‌హౌస్ వద్ద టెస్టింగ్, డ్రై రన్, వెట్ రన్‌కు 14.15 లక్షల యూనిట్ల విద్యుత్తు వాడినట్లు ఆఫీసర్లు తెలిపారు. ఈ బకాయిలు కలిపితే మొత్తం బిల్లు ఇరవై కోట్ల రూపాయలకు చేరుతుందని భూపాలపల్లి ట్రాన్స్‌కో ఎస్‌ఈ నరేశ్ తెలిపారు. 2018 డిసెంబర్‌లోనే కన్నెపల్లి పంప్‌హౌస్‌కు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఈ పంప్‌హౌస్‌లో ఉన్న ఒక్కో మోటార్ కెపాసిటీ 40 మెగావాట్లు. మోటార్ ఒక రోజంతా నడిపితే 2300 క్యూసెక్కుల నీటిని పంప్ చేసే వీలుంది. ప్రస్తుతం ఇక్కడ ఆరు పంప్‌ల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి అన్నారం బ్యారేజీకి తరలిస్తున్నారు. మంగళవారం వరకు ఇక్కడి పంప్‌లు మొత్తం 859 గంటలు రన్ చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌లు పూర్తి స్థాయిలో వాడితే ఈ బిల్లు అయిదు రెట్లకు పెరుగుతుందని అంచనా.
*హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ
హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పీపీఏలను(పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్) సమీక్షించాలని ప్రభుత్వం జారీ చేసిన.. జీవో నెం. 63ను ఉన్నతన్యాయస్థానం నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది. పీపీఏలపై సంప్రదింపులకు రావాలని.. ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖను కూడా సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. పీపీఏల సమీక్షకు ప్రభుత్వం జారీ చేసిన జీవోపై.. 40 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి కంపెనీల తరపున సుప్రీం కోర్టు న్యాయమూర్తి ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు
* ఏపీ హైకోర్టులో ఆగష్ణు 22వ తేదీకి వాయిదా పడిన పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కేసుపీపీఏలపై సమీక్ష కోసం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ ఈ నెల 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 63 నాలుగు వారాల పాటు నిలిపివేతవిద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటీషన్లపై కౌంటర్ పిటీషన్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్ట్ సూచననాలుగు వారాలపాటు పవన, సౌర విద్యుత్ సంస్థలకు తాత్కాలిక ఉపశమనం.
* ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా పారిశ్రామిక రాయితీలు ఇవ్వడం కుదరదు… పార్లమెంటు లో స్పష్టం చేసిన నితిన్ గడ్కరీ.
* పార్లమెంటు సమావేశాలు ఆగష్టు 7 వరకు పొడిగింపు.
*ఢిల్లి పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుళ్లను ఉద్యోగాలనుంచి తొలగించారు. ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఒక ఆటో డ్రైవర్‌పై దాడి చేసి తీవ్రంగా కొట్టిన కేసులో వారిని ఉద్యోగాలనుంచి తొలగించారు. కానిస్టేబుళ్లు పుష్పీందర్‌షెకావత్, సత్యప్రకాశ్‌లను ఉద్యోగాలనుంచి తొలగిస్తూ ఫస్ట్ బెటాలియన్ డిసిపి రాకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
*మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ప్రజలను వరుస భూకంపాలు వణికించాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో కేవలం 12 నిమిషాల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. తొలుత అర్ధరాత్రి 1.03 గంటలకు భూకంపం సంభవించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 3.8గా నమోదైంది. ఆ తర్వాత 1.15 గంటల వరకు 3.6, 2.9, 2.8 తీవ్రతతో మూడు సార్లు భూమి కంపించింది.
*ఏపీలో పురపాలక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ కసరత్తు ఊపందుకుంది. ఎన్నికలకు ముందే కొత్త పురపాలికలు, నగరపంచాయితీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 50 పట్టణాల స్థాయిని పెంచేందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ నెల 31లోగా ఆయా పట్టణాల స్థాయిపెంపుపై వివరాలు ఇవ్వాలని పురపాలక శాఖ కోరింది. సమీప గ్రామాలు, ప్రాంతాల విలీనంపైనా సమాచారం కోరింది.
*జాస్వామ్య తెలంగాణ వేదిక పిలుపు మేరకు అఖిల పక్షం ఆధ్వర్యంలో సచివాలయ ముట్టడికి నేతలు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నాచౌక్ వద్ద నిరసన చేపట్టేందుకు ఇందిరాపార్కు నుంచి ర్యాలీగా వెళ్తున్న నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. తెదేపా నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ధర్నాచౌక్ వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి గోషామాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అన్నిసౌకర్యాలు ఉన్న అసెంబ్లీ, సచివాలయాల పునర్నిమాణం చేపట్టవద్దని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు.
*నిజం బయటపడింది. ఎవరి నోట బయటపడాలో వారి నోటనుంచే బయటపడింది. ముష్కరులు, ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయమిస్తోందన్న ఆరోపణలు నిజమేనని తేలిపోయింది. తమ దేశంలో 30,000-40,000 మంది శిక్షణ పొందిన సాయుధ ఉగ్రవాదులు ఉన్నారని, వీరంతా కశ్మీర్, అఫ్గానిస్థాన్లలో పనిచేసినవారేనని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా అంగీకరించారు.
*ఇంగ్లాండ్కు ప్రపంచకప్ గెలుపు మత్తు వదిలే షాక్! బుధవారం పసికూన ఐర్లాండ్తో ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్లో ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 85 పరుగులకే కుప్పకూలింది. ఐరిష్ బౌలర్ల ధాటికి విలవిల్లాడిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరడానికి పోటీపడ్డారు.
*రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నూతన ఆబ్కారీ విధానంలో అదనపు దుకాణాలకు సంబంధించిన అంశాన్ని చేర్చబోతున్నారు.
*వివిధ స్వప్రయోజనాల కోసం ప్రజలు ప్రకృతిని ధ్వంసం చేస్తుండటంపై బుధవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే సరస్సులన్నీ మాయమయ్యాయని.. ఇకపై రాళ్లనూ మిగల్చరా అంటూ ప్రశ్నించింది.
*రాష్ట్రాలు మంజూరు చేసే రాయితీలు అందుకొనే లబ్ధిదారుల గుర్తింపు కోసం ఆధార్ వినియోగానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం ఇక్కడ జరిగిన మంత్రివర్గ సమావేశం ఇందుకు ఆమోదముద్ర వేసింది.
*చిన్నారులపై అత్యాచారాల వంటి లైంగిక హింసకు పాల్పడేవాళ్లను బహిరంగంగా ఉరితీయాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కోరారు. పోక్సో చట్టం-2012 సవరణ బిల్లుపై బుధవారం చర్చలో మాట్లాడుతూ.. నేరగాళ్లకు అందరిముందూ ఉరిశిక్ష వేస్తేనే ఇతరులకూ భయం ఉంటుందన్నారు. ‘‘బిల్లును తెరాస తరపున సమర్థిస్తున్నాం.
*అగ్రిగోల్డ్, సహారా, శారదా కుంభకోణ బాధితుల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని తెరాస లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. నియంత్రణ లేని డిపాజిట్ల నిషేధం బిల్లుపై బుధవారం లోక్సభలో ఆయన మాట్లాడారు.
* ఒకరిని ఉగ్రవాదిగా ప్రకటించే అంశంపై మరికొంత స్పష్టత ఇవ్వాలని పెద్దపల్లి లోక్సభ సభ్యుడు డాక్టర్ వెంకటేష్ నేత కోరారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల(నియంత్రణ) చట్టం సవరణ బిల్లుపై లోక్సభలో బుధవారం ఆయన మాట్లాడారు.
* గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో మృతి చెందితే బాధిత కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం అందించనున్నట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. సిలిండర్ పేలుళ్లలో బాధితులకు చెల్లించే పరిహారంపై రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
*ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. విజయవాడలోని రాజ్భవన్ వేదికగా బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ సి.ప్రవీణ్కుమార్ కొత్త గవర్నర్తో ప్రమాణం చేయించారు.
*ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ జనరల్, ఒకేషనల్ పరీక్షల్లో 28.29 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో తప్పిన విద్యార్థులు 1,49,605 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకాగా వారిలో 42,331 మంది పాసయ్యారు.
*రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జి ఉపకులపతులుగా ఐఏఎస్ అధికారులు వ్యవహరించనున్నారు. ప్రస్తుత ఉపకులపతుల మూడేళ్ల పదవీకాలం బుధవారంతో ముగియడంతో ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జులుగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
*ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా చేపడుతున్న రివర్స్ పంప్హౌస్లో 5 మోటార్ల బిగింపు పనులను వచ్చే నెల 5 లోగా పూర్తిచేయాలని, అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిర్మాణసంస్థ అధికారులను హెచ్చరించారు.
కాళేశ్వరం కరెంట్ బిల్లు రూ.20 కోట్లు-తాజావార్తలు–07/25
Related tags :