53 ఏళ్ల వయసు వచ్చినా ఇప్పటికీ సల్మాన్ ఖాన్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరే. సల్లూభాయ్ పెళ్లి గురించి ఎవరెన్ని చర్చించినా ఆయన మాత్రం వివాహానికి నో అంటున్నారు. మంచి తండ్రిని కాగలనేమో కానీ మంచి భర్తను కాలేనని ఇప్పటికే చాలాసార్లు అన్నారు. అయితే పెళ్లి చేసుకోమని ఎవ్వరూ తనని సంప్రదించలేని షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు సల్మాన్. ఈ విషయాన్ని ఆయన ఫిలింఫేర్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఇప్పటివరకు పెళ్లి చేసుకోమని ఎవ్వరూ నన్ను అడగలేదు. ఎందుకంటే నాకు క్యాండిల్ లైట్ డిన్నర్లు నచ్చవు. క్యాండిల్ లైట్‌లో నేను ఏం తింటున్నానో నాకు కనిపించదు. కానీ నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోమని అడగనందుకు బాధగా ఉంది’ అని తెలిపారు. ప్రస్తుతం ఆయన ‘దబాంగ్ 3’ సినిమాతో బిజీగా ఉన్నారు. సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
చీకటి భోజనాలు నచ్చవు
Related tags :