Devotional

రామప్పకు యునెస్కో టీమ్

UNESCO Team To Come Visit Ramappa Temple - రామప్పకు యునెస్కో టీమ్

1. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో రామప్పకు యునెస్కో టీమ్ – ఆద్యాత్మిక వార్తలు 07/25
ప్రపంచ వారసత్వ గుర్తింపు కోసం పోటీ పడుతున్న మన రామప్ప దేవాలయాన్ని పరిశీలించేందుకు యునెస్కో నుంచి ఓ బృందం సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో ఇండియా వస్తోంది. వాళ్లు వచ్చే తేదీ ఇంకా తెలియదని, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో వస్తారని, అందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నామని టూరిజం, కల్చర్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ బి. వెంకటేశం చెప్పారు. రామప్పకు హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు చాలా కాలంగా పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉందన్నారు. హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు కోసం రాష్ట్రం నుంచి ఎంపికైన తొలి కట్టడం రామప్పని చెప్పారు. యునెస్కో ట్యాగ్‌‌‌‌‌‌‌‌ వచ్చేందుకు గుడికి మంచి చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందన్నారు. గుడి దగ్గర సరైన పార్కింగ్‌‌‌‌‌‌‌‌, లాడ్జింగ్‌‌‌‌‌‌‌‌ సౌకర్యం లేదన్న విమర్శలకు వెంకటేశం స్పందిస్తూ.. సౌకర్యాలను హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు తర్వాత కూడా ఏర్పాటు చేయొచ్చని, ప్రస్తుతానికి గుడి కట్టడంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. 2020కి గాను వరల్డ్‌‌‌‌‌‌‌‌ హెరిటేజ్‌‌‌‌‌‌‌‌ సైట్‌‌‌‌‌‌‌‌ గుర్తింపు కోసం దేవాలయం పోటీ పడుతున్న విషయం తెలిసిందే
2. జగన్మాత సేవలో ఉపసభాపతి..!
ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి వేర్వేరుగా బుధవారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు వారికి ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. ఉప సభాపతి కోన రఘుపతికి వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారికి ఆశీర్వచన మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం ఈవో కోటేశ్వరమ్మ వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.
3. యాదాద్రీశుడికి ‘గిరిజన’ మకరందం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యపూజకు ఆదిలాబాద్ అడవుల్లో లభించే పట్టుతేనెను వినియోగించనున్నారు. ప్రతి నెలా 50 కిలోల తేనెను సరఫరా చేయాలంటూ ఆలయ ఈవో… తెలంగాణ గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు లేఖ రాశారు. రెండు రోజుల్లో తేనెను గిరిజన శాఖ పంపించనుంది. అడవుల నుంచి సేకరిస్తున్న తేనెను రాష్ట్రంలోని దేవాలయాల్లో నిత్యపూజలకు వినియోగించాలన్న గిరిజన శాఖ ప్రతిపాదనను ఇప్పటికే దేవాదాయ శాఖ ఆమోదించింది. జీసీసీ నుంచి తేనెను తీసుకోవాలంటూ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు ఆ శాఖ కమిషనర్ లేఖ రాశారు. తొలుత యాదాద్రి నుంచి 50 కిలోల తేనెకు ఆర్డరు వచ్చిందని గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు సర్వేశ్వర్రెడ్డి తెలిపారు. ప్రసాదాల తయారీకి అవసరమైన పసుపు, కారాన్ని కూడా జీసీసీ నుంచి తీసుకునేందుకు దేవస్థానం సుముఖంగా ఉందని.. ఆర్డరు వస్తే త్వరలోనే సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
4. భద్రాచలం ఆలయ భూముల్లో గుడిసెలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా నిర్మించిన గుడిసెలు తొలగించే క్రమంలో బుధవారం తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఆలయ సిబ్బందికి స్వల్పంగా గాయాలయ్యాయి. భద్రాచలం నుంచి గోళ్లగట్టకు వెళ్లే మార్గంలో 105 ఎకరాలను గోశాల నిర్మాణం కోసం రామాలయం అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం పంచాయతీలో ఉంది. ఇంత స్థలం గోశాలకు ఎందుకని అక్కడి వ్యక్తులు కొందరు ఆలయ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈలోగా ముగ్గురు గుడిసెలను నిర్మించేందుకు పూనుకున్నారు. రామాలయం అధికారులు విషయాన్ని ఎటపాక పోలీసులకు వివరించారు. దాదాపు 20 రోజులైనా ఈ ఫిర్యాదును పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో మరిన్ని నిర్మాణాలు వెలిసే ప్రమాదముందని బుధవారం ఆలయ సిబ్బంది సెక్యూరిటీ గార్డులతో కలిసి తమ భూమిని పరిశీలించేందుకు వెళ్లారు. ఓ తాటాకుల గుడిసెను తొలగించేందుకు పూనుకోగా ఇరువర్గాల మధ్య వివాదం ముదిరి ఘర్షణకు దారితీసింది. ఇందులో ఇద్దరు ఉద్యోగులతోపాటు మరో ఔట్సోర్సింగ్ సిబ్బందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఏఈవో శ్రావణ్కుమార్ ఎటపాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఘర్షణకు దారితీసిన పరిస్థితులను తూర్పుగోదావరి కలెక్టర్కు వివరించినట్లు ఆలయ ఈవో తాళ్లూరి రమేశ్బాబు తెలిపారు.
5. సింహాచలంలో వరద పాయస ఉత్సవం
రాష్ట్రంలో వర్షాలు బాగా కురిసి సుభిక్షంగా ఉండాలని కోరుతూ సింహాచలం కొండ శిఖరంపై కొలువైన వైకుంఠవాసుడి సన్నిధిలో వరద పాయసం ఉత్సవాన్ని బుధవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సింహగిరిపై అప్పన్న స్వామి ఆలయానికి ఉత్తర భాగాన వైకుంఠవాసుల మెట్టపై కొలువైన వైకుంఠ నారాయణుడికి కరవు సమయాల్లో నైవేద్యంగా సమర్పించిన పాయసాన్ని కొండపైన రాతిబండలపై నుంచి వరదలా పోస్తారు. దీన్నే వరద పాయసం ఉత్సవంగా పిలుస్తారు. ఈ ఉత్సవంలో భాగంగా అప్పన్న ఆలయ అర్చకులు వైకుంఠ నారాయణుడికి పంచామృతాభిషేకాలు, విరాటపర్వ పారాయణం, వరుణ మంత్ర జపాలు నిర్వహించారు. బండలపై పోసిన పాయసాన్ని భక్తులు మహా ప్రసాదంగా స్వీకరించారు.
6. శుభమస్తు
తేది : 25, లై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : అష్టమి
(నిన్న రాత్రి 6 గం॥ 2 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 16 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని
(నిన్న సాయంత్రం 3 గం॥ 40 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 5 గం॥ 35 ని॥ వరకు)
యోగము : ధృతి
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 15 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 58 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 9 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 31 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 3 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 15 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 44 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 22 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 59 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 52 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 52 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మేషము
7. చరిత్రలో ఈ రోజు/జూలై25*
1935 : తెలుగు సినీ నటుడు మరియు భారత పార్లమెంటు సభ్యుడు కైకాల సత్యనారాయణ జననం.
1952 : ప్రముఖ మిమిక్రీ మరియు వెంట్రిలాక్విజం కళాకారుడు లోకనాథం నందికేశ్వరరావు జననం.
1977 : భారత రాష్ట్రపతి గా నీలం సంజీవరెడ్డి అధికారం చేపట్టాడు.
1981 : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము అనంతపురం లో స్థాపించబడినది.
1982 : భారత రాష్ట్రపతిగా జ్ఞానీ జైల్సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
1987 : భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకట రామన్ అధికారంలోకి వచ్చాడు.
1992 : శంకర్ దయాళ్ శర్మ భారత రాష్ట్రపతిగా పదవిలోకి వచ్చాడు.
1997 : కె.ఆర్.నారాయణన్ భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టాడు.
2002 : భారత రాష్ట్రపతిగా ఎ.పి.జె.అబ్దుల్ కలాం అధికారం చేపట్టాడు.
2007 : భారత తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ అధికార బాధ్యతలు స్వీకరించింది
8. *తిరుమల \|/ సమాచారం* *_*ఓం నమో వేంకటేశాయ!!*_
• ఈ రోజు గురువారం,
*25.07.2019*
ఉదయం 5 గంటల
సమయానికి,
_తిరుమల: *21C° – 29℃°*_
• నిన్న *74,105* మంది
భక్తుల కు కలియుగ దైవం
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
దర్శన భాగ్యం కల్గినది,
• స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం
క్యూ కాంప్లెక్స్ లో గదులన్నీ
భక్తులతో నిండినది, భక్తులు
బైట చేచియున్నారు,
• ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనాని కి సుమారు
*24* గంటలు పట్టవచ్చును
• నిన్న *32,619* మంది
భక్తులు స్వామి వారికి
తలనీలాలు సమర్పించి
మొక్కులు చెల్లించుకున్నారు
• నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు
సమర్పించిన నగదు
*₹: 3.36* కోట్లు,
• శీఘ్రసర్వదర్శనం(SSD),
ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్
₹:300/-), దివ్యదర్శనం
(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా
ఆరు గంటల సమయం
పట్టవచ్చును,
*_వయోవృద్దులు మరియు దివ్యాంగుల_*
• ప్రత్యేయకంగా ఏర్పాటు
చేసిన కౌంటర్ ద్వారా
ఉ: 10 గంటలకి (750)
మ: 2 గంటలకి (750)
ఇస్తారు,
*_చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలు_*
• సుపథం మార్గం గుండా శ్రీవారి
దర్శనానికి అనుమతిస్తారు
ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు
దర్శనానికి అనుమతిస్తారు,
*శ్రీవేంకటేశ్వర సుప్రభాతం*
_!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!_
*తా:* _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది_
_కావున లెమ్ము స్వామి_
*ttd Toll free #18004254141*
8. మనకొక వామనాలయం!
ఇంతింతై వటుడింతై.. ఆకాశమంతై.. మూడడుగులు కోరి.. ముజ్జగాలకూ మేలు చేసిన స్వామి వామనుడు. బలిని పాతాళానికి తొక్కిన త్రివిక్రమ రూపం మహోన్నతం. ఆ అపురూప మూర్తి కొలువుదీరిన ఆలయాలు మన దేశంలో రెండే రెండు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు! అందులో ఒకటి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉందని తెలిస్తే.. ఆనందం కలగక తప్పదు!! మరొకటి కేరళలోని ఎర్నాకులంలో ఉంది.ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో త్రివిక్రమ స్వామి ఆలయం ఉంది. అపురూప శిల్పసంపదతో అలరారు స్వామి ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. తొమ్మిది అడుగుల ఎత్తుండే స్వామివిగ్రహం గోధుమ వర్ణంలో మెరిసిపోతూ దర్శనమిస్తుంది. చోళరాజుల్లో పదోవాడైన విష్ణువర్ధన మహారాజు ఓ సారి ఈ ప్రాంతానికి విహారానికి వచ్చాడట. ఇక్కడి కోనేటిలో తివిక్రమ స్వామి విగ్రహం ఉండటం గమనించి.. చుట్టూ మంటపం నిర్మింపజేశాడట. తర్వాత రాజరాజనరేంద్రుడి కాలంలో ఆలయం, మంటపాలు నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది.ఆలయంలో అడుగడుగునా ఆనాటి కళావైభవం దర్శనమిస్తుంది. మూలవిరాట్టుకు ఉత్తర దిశలో భూదేవి, దక్షిణాన శ్రీదేవి అమ్మవార్ల విగ్రహాలున్నాయి. సమీపంలో 12 మంది అళ్వారుల విగ్రహాలుంటాయి. ద్వారపాలకుల విగ్రహాలు గంభీరంగా దర్శనమిస్తాయి. గర్భాలయం వెలుపలి గోడలపై రామాయణ గాథ, భాగవత ఘట్టాలు, దశావతారాలు, వినాయకుడు తదితర దేవతా విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయ పరిసరాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ప్రశాంతతనూ చేకూరుస్తాయి. శ్రీకృష్ణాష్టమి, వామన జయంతి, దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం విష్ణు సహస్రనామార్చన, ఏకాదశి సందర్భంగా తిరుమంజనం సేవ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి చెరుకూరు 19 కి.మీ. దూరంలో ఉంటుంది. గుంటూరు జిల్లా బాపట్ల నుంచీ అంతే దూరంలో ఉంటుంది. రెండు ప్రాంతాల నుంచి చెరుకూరుకు బస్సు సౌకర్యం ఉంది. చీరాల, బాపట్ల రైల్వేస్టేషన్లలో దిగి చెరుకూరు చేరుకోవచ్చు.బలిని పాతాళానికి తొక్కిన తర్వాత.. దేవతలు వామనుడిని స్తుతించారు. త్రివిక్రమ రూపాన్ని ఎప్పటికీ దర్శించుకునే వరమివ్వమని కోరుకున్నారు. దానికి సమ్మతించిన వామనస్వామి ఇక్కడ వెలిశారని చెబుతారు. బలిని చరపట్టినందున ఈ ప్రాంతాన్ని చరయూరుగా కాలక్రమంలో చెరుకూరుగా పిలుస్తున్నారు.
9. అత్తా కోడళ్ల వింత ఆలయం!
అత్తా కోడళ్లకు కూడా ఓ వింత ఆలయం ఉంది. ప్రత్యేకంగా వారి కోసం ఆలయాన్నే నిర్మించారు. అసలు ఆ గుడిని ఎందుకు కట్టారో? ఎక్కడ ఉందో తెలుసా?
ఓ రాజు ఇంటిపోరే అద్భుతమైన మందిరాన్ని నిర్మించేలా చేసింది. ఆ దేవాలయ ప్రదేశమే ఇప్పుడు ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రంగానూ మారింది. ఇది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్నది. పూర్వం గ్వాలియర్ ప్రాంతాన్ని పాలించిన మహిపాలుడు అనే రాజుకు భార్య, కుమారుడున్నారు. ఆయన భార్య వైష్ణవ భక్తురాలు. ప్రతి రోజూ విష్ణువుకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసేది. అందుకోసం రాజు ప్రత్యేకంగా వెయ్యి చేతులున్న మహావిష్ణువు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని కట్టించాడు. కొన్నాళ్లకు రాజు కుమారుడికి వివాహం జరిగింది. రాజు కోడలు శివ భక్తురాలు. విష్ణువు విగ్రహాన్ని తీసేసి, దాని స్థానంలో శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోడలు పట్టుబట్టింది. దీంతో విష్ణుమూర్తి ఆలయం పక్కనే శివుని గుడిని నిర్మించారు. అత్తా కోడళ్ల పంతంతో నిర్మించిన శివ, విష్ణు దేవాలయాలు అత్త-కోడళ్ల ఆలయాలుగా మారిపోయాయి.
10. టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిగారి ప్రకటన
శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి, రెచ్చగొట్టడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నించింది: టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిటీటీడీ డీఈఓగా క్రిస్టోఫర్‌ను నియమించారంటూ తప్పుడు వార్తను టీవీ–5 ఛానెల్‌ తన వెబ్‌సైట్లో పెట్టింది: టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిసంబంధిత వెబ్‌సైట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, కేసును కూడా పెడతాం:టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యాభై రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత దిగజారింది. వైయస్‌.జగన్‌ చేస్తున్న మంచి పనులను స్వాగతించలేక ఈర్ష్యతో, ద్వేషంతో, అసూయతో వ్యవహరిస్తున్నారు. టీటీడీలో వీఐపీ సంస్కృతిని నిర్మూలించడానికి చేస్తున్న ప్రయత్నాలను స్వాగతించలేకపోతున్నారు.