రానున్నరోజుల్లో దేశంలో ఉన్న 20 నుంచి 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ఏఏఐ(ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా) ఛైర్మన్ గురుప్రసాద్ మహోపాత్ర శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏడాదికి 10లక్షల నుంచి 15 లక్షల జనసామర్థ్యం కలిగిన విమనాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే ఆరు విమానాశ్రయాలకు సంబంధించి దస్త్రం కేబినేట్‌కు చేరుకుందని, అందులో మూడింటిని ప్రైవేటీకరణ చేసేందుకు అనుమతి లభించిందన్నారు. మరికొన్నింటిలో కూడా ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి సలహాదారులను నియమించినట్లు వెల్లడించారు. వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోందన్నారు. అలాగే ‘డిజియాత్ర’ ద్వారా పేపర్‌లెస్ టికెట్ ప్రయాణాన్ని నాలుగు విమానాశ్రయాల పరిధిలోకి త్వరలో తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
ఇండియాలో పాతిక విమానాశ్రయాలు ప్రైవేటీకరణ
Related tags :