భూమా కుటుంబీకులు కమలం గూటికి చేరారు. భూమా కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డిలు శుక్రవారం నాడు బీజేపీలో చేరారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో వీరిద్దరూ బీజేపీలో చేరారు.
భూమా కుటుంబం ఇప్పటివరకు టీడీపీలో ఉంది. అయితే భూమా నాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి సోదరుడి కొడుకు భూమా బ్రహ్మనందరెడ్డిలు టీడీపీలో ఉన్నారు.
అయితే ఇదే కుటుంబానికి చెందిన భూమా కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డిలు బీజేపీలో చేరారు. భూమా కుటుంబీకులు కమలం గూటికి చేరారు. కిషోర్ రెడ్డి, మహేష్ రెడ్డి బీజేపీలో చేరారు. జేపీ నడ్డా సమీక్షంలో వారు కాషాయ కండువా కప్పుకున్నారు.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు గతంలో బీజేపీ ఆహ్వానం పలికింది. అయితే ఆమె నుండి సరైన స్పందన రాని కారణంగా అదే కుటుంబానికి చెందిన వారికి బీజేపీ నాయకత్వం వల వేసింది. బీజేపీ ప్లాన్ సక్సెస్ అయింది.
రానున్న ఎన్నికల్లో భూమా అఖిలప్రియ గంగుల కుటుంబంతో పాటు తమ కుటుంబానికి చెందిన వారితో కూడ పోటీ పడాల్సిన పరిస్థితులు ఉంటాయా అనే చర్చ కూడ లేకపోలేదు.