పేర్లు మార్చుకుంటే ఫేట్ (తలరాత) కూడా మారుతుందని చాలా మంది నమ్ముతుంటారు. ఇందుకు ప్రముఖులు అతీతులేం కాదు. ఎక్కువగా సినిమా వాళ్లు, క్రీడాకారులు వారి పేర్లలో మార్పులు చేర్పులు చేసుకుంటుంటారు. ఇలా అదృష్టాన్ని నమ్ముకునే వాళ్లలో రాజకీయ నేతలు కూడా ఉన్నారు. అందుకే వెంటనే జ్యోతిషుడి వద్ద వాలిపోతారు. పదవిని చేజేతులా వదులుకోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు. కొందరైతే పార్టీ నాయకుల మాటనైనా పెడచెవిన పెడతారేమో గానీ పండితుల వాక్కు మాత్రం తూ.చ తప్పకుండా పాటిస్తారు. కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా తాజాగా ఇదే కోవలోకి వచ్చారు. ఇది వరకు ఆయన మూడుసార్లు సీఎం పదవి చేపట్టినప్పటికీ పూర్తికాలం అందులో కొనసాగలేదు. ఈ నేపథ్యంలో ఆయన తన పేరులో స్వల్ప మార్పులు చేసుకున్నారు. ఇప్పటివరకు ఆయన పేరు యడ్యూరప్ప (BS Yaddyurappa) అని ఉండగా.. తాజాగా యడియూరప్ప (BS Yadiyurappa)గా మార్చుకున్నారు. 2007లో తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు ఆయన పేరులో మార్పులు చేసుకున్నారు. యడియూరప్ప(BS Yediyurappa)ను యడ్యూరప్ప( BS Yeddyurappa)గా మార్చుకున్నారు. రాజకీయంగా ఆ సమయంలో కాస్త గడ్డుకాలాన్ని ఎదుర్కోవడంతో జ్యోతిషుడి సలహా ప్రకారం పేరులో అక్షరాలను మార్పు చేసుకున్నారు. కానీ ఆ ఫార్ములా వర్కవుట్ కాలేదని భావించిన యడ్డీ.. తాజాగా మళ్లీ పేరులో మార్పు చేశారు. అందుకే శుక్రవారం గవర్నర్ వాజుభాయ్ వాలాకిచ్చిన లేఖలో తన పేరును తిరిగి యడియూరప్ప(Yediyurappa) అనే పేర్కొన్నారు. మరి ఈసారైనా ఆయనకి అదృష్టం కలిసివస్తుందో లేదో చూడాలి.
ఇతగాడికి జ్యోతిష్యం పిచ్చ కడు మెండు సుమీ
Related tags :